Site icon HashtagU Telugu

BRS Gates Open : అన్ని వేళలా అందుబాటులో కేసీఆర్..!

BRS Gates Open

Cm Kcr

BRS Gates Open : తెలంగాణ సీఎం కేసీఆర్ గ‌త తొమ్మిద‌న్న‌రేళ్లుగా స‌చివాల‌యానికి రాకుండానే ప‌రిపాల‌న సాగించారు. సీఎం ఎక్క‌డ ఉంటే అదే పరిపాల‌న స్థానం అంటూ ఆయ‌న చెప్పుకొచ్చారు. కొత్త స‌చివాల‌యం ప్రారంభించిన‌ప్ప‌టికీ రోజూ ఆయ‌న సీఎం కార్యాల‌య హాజ‌రకు దూరంగా ఉంటారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్ కేంద్రంగా అన్నీ న‌డిపిస్తుంటారు. లేదంటే, గ‌జ్వేల్ లోని ఫాంహౌస్ కు వ్య‌వ‌హారాలు షిఫ్ట్ అవుతుంటాయి. పెద్ద‌గా ఎవ‌రికీ అపాయింట్మెంట్ ఇవ్వ‌రు. స‌హ‌చ‌ర మంత్రుల‌కు కూడా టైమ్ ఇవ్వ‌నంత బిజీగా ఉంటారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్లో ఏమి చేస్తారో, ఎవ‌రికీ తెలియ‌దు.

గ్రూపు విభేదాల‌తో ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా..(BRS Gates Open)

గ‌త ఏడాది కాలంగా మాజీ మంత్రి, ద‌ళిత‌బంధు అమ‌లు క‌మిటీ చైర్మ‌న్ మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు అపాయిట్మెంట్ అడిగుతున్నా(BRS Gates Open) ల‌భించ‌లేద‌ట‌. కేవ‌లం మోత్కుప‌ల్లికే కాదు, చాలా మంది బీఆర్ఎస్ లీడ‌ర్ల‌కు ఇలాంటి అనుభ‌వం ఉంది. ఇత‌ర పార్టీ నుంచి వ‌చ్చే వాళ్ల‌కు కండువా క‌ప్పే రోజు మాత్ర‌మే కేసీఆర్ క‌నిపిస్తారు. ఆ త‌రువాత టీవీల్లోనో, మీటింగ్ ల్లోనూ చూడాల్సిందే. ప‌ర్స‌న‌ల్ గా క‌లుసుకోవాలంటే గ‌గ‌న‌మే. కానీ, ఇప్పుడు సీన్ మారింద‌ట‌. ఎవ‌రు అడిగినా, ర‌మ్మంటున్నార‌ని చెబుతున్నారు.

ఎన్నిక‌ల వేళ పార్టీలో అసంతృప్తుల సెగ

ఎన్నిక‌ల వేళ పార్టీలో అసంతృప్తుల సెగ కేసీఆర్ కు బాగా త‌గిలింది. ఈసారి ఎన్నిక‌ల్లో వ్యూహాలు ఎన్ని ర‌చించిన‌ప్ప‌టికీ గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌క కాద‌ని అర్థ‌మ‌యింది. అందుకే, అడిగిన వాళ్ల‌కు అడిగిన‌ట్టు ఏదో ఒక పోస్ట్ ఇస్తూ చ‌ల్ల‌బ‌రుస్తున్నారు. ఇంకా కేవ‌లం మూడు నెల‌లు మాత్ర‌మే ప్ర‌భుత్వానికి గ‌డువు ఉంది. అయిన‌ప్ప‌టికీ ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తూ సంతృప్తి ప‌రుస్తున్నారు. ఆ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ‌య్య ఉన్నారు. ఇక జ‌న‌గాం నుంచి అసంతృప్తిగా ఉన్న లీడ‌ర్ల‌కు నామినేటెడ్ పోస్ట్ ను బిస్క‌ట్ గా వేయాల‌ని భావిస్తున్నారు. అందుకే, నేరుగా ప్ర‌గ‌తిభ‌వ‌న్ మెట్లు (BRS Gates Open) తొక్కే అవ‌కాశం అంద‌రికీ ల‌భిస్తుంద‌ట‌.

Also Read : MLC kavitha: గవర్నర్ నిర్ణయం.. బీసీలకు అన్యాయం: ఎమ్మెల్సీ కవిత ధ్వజం

ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా మాత్ర‌మే టీఆర్ఎస్ ఉంటుంద‌ని 2014 ఎన్నిక‌లకు ముందుగా ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు ఉద్య‌మ వాస‌న‌ల‌ను పూర్తిగా క‌డిగేశారు. బంగారు తెలంగాణ అంటూ ఒక ట్యాగ్ కింద‌కు అంద‌ర్నీ చేర్చారు. ఇత‌ర పార్టీల‌ను నిర్వీర్యం చేయ‌డానికి సీఐడీ, ఏసీబీల‌ను వాడారు. దీంతో కారులో ఎక్క‌డానికి బ‌డాబాబులు అంద‌రూ ముందుకొచ్చారు. ఇప్పుడు టిక్కెట్ల విష‌యంలో మాత్రం సై అంటే సై అంటున్నారు. మ‌ల్కాజ్ గిరి నుంచి టిక్కెట్ ఇచ్చిన మైనంప‌ల్లి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఇచ్చిన టిక్కెట్ ను కూడా కాదునుకుని కాంగ్రెస్ పార్టీకి వెళ్లిపోయారు. అంటే , బీఆర్ఎస్ నుంచి గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని ఆయ‌న‌కు అర్థ‌మయింది. అంతేకాదు, మెద‌క్ నుంచి కుమారుడికి టిక్కెట్ ఇవ్వ‌లేద‌ని అక్క‌సును కూడా పెట్టుకున్నారు. ఇలాంటి ఎపిసోడ్ లు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఉన్నాయి.

Also Read : Bank Holidays in October 2023 : అక్టోబర్ నెలలో ఏకంగా 16 రోజులు బ్యాంకులకు సెలవులు..

గ్రూపు విభేదాల‌తో ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ త‌ల‌ప‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం స‌ర్వేల ప్ర‌కారం ఖ‌మ్మం, న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల్లో ఒక్క‌ళ్లు కూడా గెలిచే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. అందుకే, కేసీఆర్ కూడా రెండు చోట్ల పోటీకి దిగుతున్నార‌ని కాంగ్రెస్ చెబుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎవ‌రు ఎప్పుడు ప్ర‌గ‌తిభ‌వ‌న్ గేట్ల‌ను ట‌చ్ చేసినా, వెంట‌నే లోప‌ల‌కు వెళ్ల‌డానికి అనుమ‌తి ల‌భిస్తోంది. గ‌త తొమ్మిదిన్న‌రేళ్లుగా ఎప్పుడు తెరుచుకోని గేట్లు ఇప్పుడు ఓపెన్ కావ‌డానికి కార‌ణం ఏమిటి? అంటే పార్టీ గెలుపు మీద అప‌న‌మ్మ‌కం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.