తెలంగాణ సీఎం కేసీఆర్ (BRS Game)ఎత్తుగడకు కామ్రేడ్లు బోల్తాపడ్డారు. జరిగిన మోసాన్ని నిదానం తెలుసుకున్నారు. మునుగోడులో అవసరార్థం ఉపయోగించుకున్నారని ఆలస్యంగా తెలిసిసొచ్చింది. ఇప్పుడు మేల్కొని నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉభయ కమ్యూనిస్ట్ లు వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా ప్రజల ముందుకొస్తాయని ప్రకటించడం గమనార్హం.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎత్తుగడకు కామ్రేడ్లు బోల్తా(BRS Game)
కమ్యూనిస్ట్ లు అంటే కాకలుతీరిన రాజకీయయోధులు. అనుపానుపులు తెలుసని అందరూ అనుకుంటారు. రాజకీయ వ్యూహాలను రచించడంలోనూ దిట్టలుగా పేరుంది. కానీ, కేసీఆర్ చతురతకు (BRS Game) బొక్కా బోర్లాపడ్డారు. ఏరుదాటిన తరువాత బోడిమల్లయ్య అన్నట్టు మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తరువాత కామ్రేడ్లను పక్కన పెట్టేశారు కేసీఆర్. ఆ విషయం 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను సోమవారం కేసీఆర్ ప్రకటించే వరకు ఎర్రన్నలు తెలుసుకోలేకపోవడం విచిత్రం.
మునుగోడు ఉప ఎన్నిక తరువాత కామ్రేడ్లను పక్కన పెట్టేశారు కేసీఆర్
రాజకీయ చతురతను ప్రదర్శించడంలో కేసీఆర్ ను మించిన నేతలు తెలుగు రాష్ట్రాల్లో కనిపించడంలేదు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎలా బలహీనపరిచారో, అందరికీ తెలుసు. రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని అప్పట్లో కాంగ్రెస్ సీనియర్లకు ప్రామిస్ చేశారు కేసీఆర్. ఆ విషయాన్ని పలుమార్లు కేకే, డీఎస్ లాంటి వాళ్లు చాలా సందర్భాల్లో చెప్పారు. తీరా, ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన తరువాత ప్లేట్(BRS Game) ఫిరాయించారు.
రాజకీయ చతురతను ప్రదర్శించడంలో కేసీఆర్ ను
ప్రత్యేక రాష్ట్రం కోసం సోనియాను దేవతగా ప్రశంసించారు కేసీఆర్. రాష్ట్ర ప్రకటించిన మరుక్షణం నుంచి దెయ్యంగా అభివర్ణించారు. ఎప్పుడో 2009లోనే ఇవ్వాల్సిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోవడంతో బలిదానాలు పెరగడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ కేసీఆర్ 2014 ఎన్నికల్లో నినదించారు. అంతేకాదు, అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం ఇవ్వడానికి లెటర్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీని నామరూపాల్లేకుండా చేశారు. ఆ తరువాత ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అసెంబ్లీలో విలీనం చేసుకున్న రాజకీయ నేర్పరి (BRS Game)కేసీఆర్. ఆయన వాలకాన్ని దగ్గర నుంచి చూసిన తెలంగాణ కామ్రేడ్లు నమ్మారు. మునుగోడు ఎన్నికల్లో గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టారు.
Also Read : BRS Tickets: మహిళలకు కేసీఆర్ మొండిచేయి, కేవలం ఏడుగురికే ఛాన్స్!
మునుగోడు ఉప ఎన్నిక ముగిసే వరకు కమ్యూనిస్ట్ లను మిత్రపక్షంగా కేసీఆర్ భావించారు. ఆ తరువాత క్రమంగా వాయిస్ మారింది. జాతీయ స్థాయిలోని ఇండియా కూటమి, ఎన్డీయే కూటమికి సమదూరంగా కామ్రేడ్లు లేరని చెబుతూ దూరం జరిగారు. కమ్యూనిస్ట్ ఆశించిన స్థానాల్లోనూ సోమవారం అభ్యర్థులను ప్రకటించారు. ఎలాంటి సంప్రదింపులు కూడా లేకుండా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడాన్ని ఎర్రన్నలు సీరియస్ గా తీసుకున్నారు. ఎక్కడో బీజేపీతో సఖ్యత కేసీఆర్ కుదుర్చుకున్నారని అనుమానిస్తున్నారు. అందుకే, కమ్యూనిస్ట్ లకు దూరం జరిగారని ఆరోపిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమితో పొత్తుతో ఉన్న కామ్రేడ్లు కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్రంలోనూ వెళతామని ఇప్పటికీ ప్రకటించలేదు.
Also Read : BRS list strategy : KCR వ్యూహాలకు అర్థాలు వేరు.!
జాతీయ స్థాయిలో ఒక రకమైన రాజకీయాలను, రాష్ట్రాల్లో మరో విధంగా నడపాలని కామ్రేడ్లు భావిస్తున్నారు. ఆ కోణం నుంచి ఆలోచించిన కామ్రేడ్లు బీఆర్ఎస్ తో పొత్తుకు సిద్దయ్యాయి. కానీ, కేసీఆర్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో, రుచి చూపించారు. ఇప్పుడు ఎర్రన్నలకు కాలుతోంది. అయినప్పటికీ కేసీఆర్ ను ఏమీ పీకలేక ఉమ్మడిగా బరిలో దిగుతామంటూ ప్రకటించారు. అంతేగానీ, కాంగ్రెస్ తో కలిసి వెళ్లడానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటో చెప్పడంలేదు. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయేలా కేసీఆర్ ఎత్తుగడ మరొకటి వేశారా? అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో కామ్రేడ్లు పొత్తు ప్రకటించే వరకు ఇలాంటి అనుమానాలను ఆపలేం.!