KCR Strategy: ఆ ఎమ్మెల్యేలకు కేసీఆర్ టికెట్లు ఇస్తారా..? పక్కన పెట్టేస్తారా?

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం కేసీఆర్ దూకుడు పెంచుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - August 16, 2023 / 04:06 PM IST

బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో స్థానిక నేతలను రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో జిల్లాలో కనీసం రెండు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ఆలోచనలో రావు ఉన్నట్లు సమాచారం. వారిపై వ్యతిరేకత మరో కారణమైతే, స్థానిక బీఆర్ఎస్ నాయకుల్లో కూడా వ్యతిరేకిస్తుండటం మరో కారణం. స్థానిక నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్ల జాబితాను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పనిచేయాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం పిలుపునిస్తున్నారు. తాను మార్చాలనుకుంటున్న ఎమ్మెల్యేలను కూడా పిలిపించారు. చివరి అవకాశంగా తమ నియోజకవర్గంలోని ఇతర నేతలతో సంబంధాలు నెరపాలని, ప్రజలతో మమేకం కావాలని కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఇప్పటికే ప్రతికూల నివేదికలు ఉన్నాయనే దానిపై ముఖ్యమంత్రి సర్వే చేయించి నివేదికను సమర్పించనున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో నివేదిక అందిన తర్వాత వాటిని భర్తీ చేయాలా లేక కొనసాగించాలా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.ఆగస్టు-18న 80 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించాలని కేసీఆర్ ముహూర్తం కూడా ఫిక్స్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. అయితే ఏ ఎమ్మెల్యేల‌పై వేటు ప‌డుతుంద‌ని అంతా చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో ప‌లువురు పేర్లు తెరపైకి వ‌స్తున్నాయి.

తాజాగా ఓ లిస్ట్ అయితే నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది. మేడ్చ‌ల్ నుండి మ‌ల్లారెడ్డి, కుత్బుల్లాపూర్- వివేకానంద‌గౌడ్, మ‌ల్కాజిగిరి-మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు, ఎల్బీన‌గ‌ర్- దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, మ‌హేశ్వ‌రం- స‌బితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల‌- కాలె యాద‌య్య‌, రాజేంద్రన‌గ‌ర్- ప్రకాశ్‌గౌడ్, ప‌రిగి- మ‌హేష్ రెడ్డి, వికారాబాద్ – ఆనంద్, కూక‌ట్ ప‌ల్లి- మాధ‌వ‌రావు, శేరిలింగంప‌ల్లి- అరికెపూడి గాంధీ, ఇబ్ర‌హీంప‌ట్నం – మంచి రెడ్డి కిష‌న్ రెడ్డి, ముషీరాబాద్- ముఠా గోపాల్, ఖైర‌తాబాద్- దానం నాగేంద‌ర్, జూబ్లిహిల్స్- మాగంటి గోపినాథ్‌, స‌న‌త్ న‌గ‌ర్- త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్, నాంప‌ల్లి- ఆనంద్ గౌడ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏవిధమైన చర్యలు తీసుకుంటారోనని సొంత పార్టీ నేతల్లోనే కాకుండా, ఇతర పార్టీల నేతల్లో టెన్షన్ నెలకొంది.

Also Read: Dengue Cases: డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ.. ఏపీ లో అత్యధిక కేసులు