Congress vs BRS; భారీ వర్షాలతో తెలంగాణ అస్తవ్యస్తంగా మారింది. పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్ మహా నగరం పరిస్థితి తెలిసిందేగా. తేలికపాటి వర్షాలకే నగరం స్థంబించిపోతుంది. అలాంటిది వారం రోజులుగా నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. దీంతో నగరంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. మోకాల్లోతు నీళ్లు వచ్చి చేరడంతో ప్రజల జీవనం కూడా కష్టంగా మారింది.
ఓ వైపు వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్, కేటీఆర్ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ సందర్భంగా ఈ రోజు శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ బల్దియా కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ జీహెచ్ఎంసి కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధి లేని పేద కుటుంబాలకు, కార్మికులకు పది వేల రూపాయల చొప్పున వెంటనే ఇవ్వాలని, వరదల్లో మునిగిపోయిన ప్రాంతాలను వెంటనే పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తు నిరసన తెలిపారు.
కాంగ్రెస్ నిరశనపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఓ వైపు భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం రాత్రి పగలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నది. ఎడతెరిపిలేని కుండపోత వర్షాల వల్ల వచ్చిన వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే బురద రాజకీయాలకు దిగి ఆందోళనలకు పిలుపునిచ్చి కాంగ్రెస్ రాజకీయ డ్రామాలు చేస్తున్నదని ధ్వజమెత్తింది.
Also Read: Hyderabad: చెరువులు కబ్జా చేయడంతోనే నగర పరిస్థితి ఇలా తయారైంది: రేవంత్