Site icon HashtagU Telugu

BRS : రేవంత్ రెడ్డి సోద‌రుడు చెక్కులు పంపిణి చేయడం ఫై బిఆర్ఎస్ ఆగ్రహం

Tirupathireddy

Tirupathireddy

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోదరుడు తిరుప‌తిరెడ్డి (Tirupathi Reddy) ఫై బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తిరుపతి రెడ్డి కి ఎలాంటి ప‌ద‌వి లేకున్నా.. క‌ల్యాణ‌ల‌క్ష్మి చెక్కులు పంపిణీ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తుంది. ఈయన మాత్రమే కాదు రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ నాయ‌కులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయిన అభ్య‌ర్థులు.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికారిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ ప్రోటోకాల్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పుడు తాజాగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోద‌రుడు కూడా అదే ప‌ని చేశారు. రేవంత్ రెడ్డి అన్న తిరుప‌తిరెడ్డికి ఎలాంటి ప‌ద‌వీ లేకున్నా.. క‌ల్యాణ‌ల‌క్ష్మి చెక్కులు ఎలా పంపిణీ చేస్తారంటూ దౌల్తాబాద్ జ‌డ్పీటీసీ కోట్ల మ‌హిపాల్ వేదిక‌పైనే ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రి అన్న అనే కారణంతో కల్యాణ లక్ష్మి చెక్కులు ఎలా ఇస్తారు..? ప్రోటోకాల్ ప్రకారం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయించాలి. కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన చెక్కులనే ఇస్తున్నారు కానీ కాంగ్రెస్ హామీ ఇచ్చిన తులం బంగారం ఇవ్వడం లేదంటూ తిరుపతి రెడ్డిపై కోట్ల మహిపాల్ మండిప‌డ్డారు.

Read Also : KCR: హైకోర్టుకు కేసీఆర్