తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రాగానే ఫ్రీ బస్సు పథకం (Free Bus Travel Scheme) అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల లాభాల కంటే నష్టాలూ ఎక్కువగా జరుగుతున్నాయని ప్రతి పక్ష పార్టీ బిఆర్ఎస్ తో పాటు మగవారు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఫ్రీ అని ప్రచారం చేసుకోవడం తప్ప..ప్రయాణికులకు తగ్గట్లు బస్సులను ఏర్పాటు చేయడం లేదని, దీంతో రెండు బస్సుల్లో వెళ్లాల్సిన ప్రయాణికులు ఒక్క బస్సు లో వెళ్తున్నారని..ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా కాలేజ్ టైం (College time) లో తక్కువ బస్సు లు ఏర్పాటు చేయడం వల్ల స్టూడెంట్స్ ఫుట్‌బోర్డుపై ప్రయాణం (Traveling on a student footboard) చేయాల్సి వస్తుంది. ప్రమాదకరమని తెలిసినా కూడా ఫుట్‌బోర్డు ప్రయాణం చేసి స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో చదువు కోసం తమ ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు. తాజాగా ఇదే విషయాన్నీ బిఆర్ఎస్ మరోసారి తెలియజేసింది. షాద్‌నగర్ – ఆమనగల్లులో బస్సుల కొరత కారణంగా పలువురు విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్నీ సదరు స్టూడెంట్స్ టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాసారు.
గతంలో షాద్‌నగర్ – ఆమనగల్లు రూట్‌లో 10 బస్సులు నడిపిస్తే ఇప్పుడు.. కేవలం నాలుగు బస్సులే నడిపిస్తున్నారని సజ్జనార్‌కు రాసిన లేఖలో విద్యార్థులు పేర్కొన్నారు. ఆ నాలుగు బస్సులు కూడా సమయానికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన బస్సుల్లో విద్యార్థులు సరిపోవడం లేదని తెలిపారు. అందుకే బస్సుల సంఖ్యను పెంచి విద్యాసంస్థల సమయానికి అనుగుణంగా నడిపించాలని కోరారు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని బస్సులు నడపాలని.. లేదంటే అందరం కలిసి ధర్నా చేస్తామని తెలిపారు.
బిఆర్ఎస్ పార్టీ సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించింది.ఫ్రీ బస్ అంటూ.. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్ , ఉచిత బస్సు అంటూ పబ్లిసిటీ చేసుకుంటూ.. ఉన్న బస్సులను తగ్గించి అరకొర బస్సులతో వెళ్లదీస్తున్న రేవంత్ సర్కార్! దీంతో బస్సులు లేక పరిమితికి మించి ప్రయాణికులు ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన దుస్థితి…అంటూ పోస్ట్ చేసింది.
ఫ్రీ బస్ అంటూ.. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్ 😡
ఉచిత బస్సు అంటూ పబ్లిసిటీ చేసుకుంటూ..
ఉన్న బస్సులను తగ్గించి అరకొర బస్సులతో వెళ్లదీస్తున్న రేవంత్ సర్కార్!దీంతో బస్సులు లేక పరిమితికి మించి ప్రయాణికులు ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన దుస్థితి.
బస్సులు లేక ఫుట్… pic.twitter.com/uUYO5BJJ4D
— BRS Party (@BRSparty) October 22, 2024
Read Also : DiCaprio’s Himalayan Snake : హిమాలయాల్లోని కొత్త పాములకు హీరో పేరు!