Jeevan Reddy: కేంద్రంలో మోడీయిజం.. తెలంగాణలో రేవంత్ రౌడీయిజం

  • Written By:
  • Updated On - April 24, 2024 / 12:06 AM IST

Jeevan Reddy: చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదని ఆయన చిల్లర మల్లర రేవంత్ రెడ్డి అనిబీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. నిజామాబాద్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెసోళ్లు మోసగాళ్లకు మోసగాళ్ళుఅని మండిపడ్డారు. నిన్న నిజామాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలను ఏమార్చే అబద్దాలు చెప్పారన్నారు. నాలుగు నెలల క్రితం అధికారంలోకి రాగానే అదిస్తాం, ఇదిస్తాం అని చెప్పి మోసగించిన రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సరికొత్త మోసాలకు తెరదీసారని ఆయన పేర్కొంటూ తల్లికి అన్నం పెట్టానోడు, చిన్నమ్మకు బంగారు గాజులు పెడతానంటే నమ్మాలా అని మండిపడ్డారు. కాంగ్రెస్ దిక్కుమాలిన పాలనలో రోడ్లపాలైన రైతాంగం విలపిస్తోందన్నారు.
రైతుతో,కేసీఆర్ తో పెట్టుకున్నోడెవడూ బాగుపడలేదు. ఆర్మూర్ ఎర్ర జొన్న రైతుల కడుపులో బుల్లెట్లు దింపిన కాంగ్రెస్ ఖాతమైంది. బషీర్ బాగ్ లో రైతులను కాల్చి చంపిన చంద్రబాబు పతనమైండు.

కేంద్రంలో మోడీయిజం..రాష్ర్టంలో రేవంత్ రౌడీయిజం నడుస్తోంది. ధాన్యం కుంభకోణం లో వచ్చిన రూ.15వందల కోట్ల అవినీతి సొమ్మును ఎన్నికల ఖర్చుల కోసం కాంగ్రెస్ అధిష్టానం కు కప్పం కట్టిన రేవంత్ రెడ్డి ధన జాతర చేస్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు కోసం కేసీఆర్ ప్రభుత్వం సిద్ధం చేసి ఎన్నికల కోడ్ వల్ల ఇవ్వలేకపోయిన కోట్లాది రూపాయల ను రేవంత్ రెడ్డి కాంట్రాక్టు బిల్లుల బకాయిల కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ కు ధారాదత్తం చేశారు అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఎంపీ అరవింద్ రైతులను మోసగించిన దగాకోరు అనిఆయన నిప్పులు చెరిగారు. ఎఫ్-3ఎంపీ అరవింద్ కు కర్రుకాల్చి వాత పెట్టుడేనన్నారు. అరవింద్ ఒక ఎప్-3 ఎంపీ. ఆయన చదువు ఫాల్స్, పసుపు బోర్డ్ తెస్తానని రాసిచ్చిన బాండ్ పేపర్ ఫేక్, ఆయన మాటలు ఫాల్స్. ఎంపీగా ఏనాడైనా ప్రజలను పట్టించుకున్నాడా?, మీ మంచీ చెడులకు వచ్చాడా?.పసుపు బోర్డు తేకుండా రైతులను వంచించలేదా?.అలాంటి నయవంచకుడుకి మళ్లీ ఓటేద్దామా?
జగిత్యాలలో చెల్లని జీవన్ రెడ్డి నిజామాబాద్ లో చెల్లుతాడా?. పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు.

డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు సీఎం రైతులకు క్షమాపణ చెప్పాలి. రుణమాఫీ కోసం బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటానికి భయపడే రేవంత్ ఈ ప్రకటన చేశారు. ఎకరానికి 15000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఇవ్వలేదు?. వ్యవసాయ కూలీలకు 12000 ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదు?.
మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు 2500 చొప్పున ఇస్తామన్న హామీ ఏమయింది?. తులం బంగారం వచ్చిందా? జీవన్ రెడ్డి ప్రశ్నించారు.