Site icon HashtagU Telugu

Shakeel Son Raheel : పోలీసుల అదుపులో BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్‌

Brs Ex Mla Shakeel Son Arre

Brs Ex Mla Shakeel Son Arre

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్‌ (BRS Ex MLA Shakeel Son Raheel Arrest) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దీ నెలల క్రితం ప్రజా భవన్ (Prajabhavan) వద్ద బారికేడ్‌ను ఢీకొట్టిన కేసులో షకీల్ కొడుకు రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

డిసెంబర్‌ 23 తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రగతి భవన్ వద్ద ఉన్న బారికేడ్లపైకి ఓ కారు దూసుకెళ్లి ధ్వంసం చేసింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వాహనంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని నిందితులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్​కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు రాహేల్ ఈ విధ్వంసం సృష్టించాడు. కానీ రహీల్‌కు బదులుగా మరొకర్ని డ్రైవర్‌గా చేర్చి.. రహీల్ దుబాయ్‌కి పారిపోయాడు. దీంతో అతడి ఫై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..రహీల్ ఫై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.

గత కొద్దీ రోజులుగా రహీల్ కోసం పోలీసులు వెతుకుతుండగా.. ఈరోజు హైదరాబాద్‌కు వచ్చిన రహీల్‌ను ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపైన అభియోగాలు మోపారు.

Read Also : Elvish Yadav: పాము విషం.. ఒక యూట్యూబర్.. సంచలన ఛార్జ్‌షీట్