Site icon HashtagU Telugu

BRS Ex MLA Shakeel Son Car Accident case : ఆక్సిడెంట్ చేసి దుబాయ్‌కు పారిపోయిన మాజీ ఎమ్మెల్యే కొడుకు సాహిల్‌

Brs Ex Mla Shakeel Son Car

Brs Ex Mla Shakeel Son Car

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు (BRS Ex MLA Shakeel Son Car Accident Case) సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌ అమీర్‌ అలియాస్‌ బాబా..ఆక్సిడెంట్ (Accident) చేసి దుబాయ్ కి పారిపోయాడు. ప్రమాదం తర్వాత ముంబై నుంచి దుబాయ్ (Dubai) వెళ్లాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు లొంగిపొమ్మని సాహిల్‌తో పాటు తండ్రి షకీల్ డ్రైవర్‌పై ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు సాహిల్‌కు బదులు డ్రైవర్ వచ్చారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసేందుకు నిరాకరించిన పోలీసులు సాహిల్‌ను ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

We’re now on WhatsApp. Click to Join.

అసలు ఏంజరిగిందంటే.. ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి దాటాక.. మద్యం మత్తులో ఖరీదైన కారును నడుపుతూ.. ప్రగతి భవన్‌ ఎదురుగా ఉన్న బ్యారీకేడ్లను సాహిల్ ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ కారులో ఇద్దరు యువతులు, సాహిల్‌, మరో యువకుడు ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే సాహిల్‌ తమ డ్రైవర్‌ అబ్దుల్‌ అసిఫ్ ను మరో కారులో పిలిపించాడు. ప్రమాదానికి అసిఫ్ కారకుడిగా చూపించాలంటూ తన స్నేహితులకు చెప్పి.. మరో కారులో వెళ్లిపోయాడు. సాహిల్‌ చెప్పినట్లుగానే.. ఆసిఫ్‌ పోలీసులతో తానే ప్రమాదానికి కారణమంటూ వాంగ్మూలమిచ్చాడు. సాహిల్‌ స్నేహితులు కూడా పోలీసులకు ఇదే విషయం తెలిపారు. ప్రమాదానికి కారకుడు సాహిల్‌ అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడం తో.. సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. సీపీ ఆదేశాలతో డీసీపీ విజయ్‌కుమార్‌ రంగంలోకి దిగారు. మంగళవారం పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ బి.దుర్గారావును విచారించారు. సాహిల్‌ను తప్పించేందుకు జరిగిన కుట్రలో ఇన్‌స్పెక్టర్‌ భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించి ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న సాహిల్‌ ఫై లుకౌట్ కేసు నమోదు చేసి .. హైదరాబాద్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Read Also : Komatireddy: బిఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ త్వరలో ముగుస్తుంది: మంత్రి కోమటిరెడ్డి