Telangana: అసెంబ్లీలో కేసీఆర్‌కు పెద్ద ఛాంబర్‌ కేటాయించండి ప్లీజ్: బీఆర్ఎస్

అసెంబ్లీలో కేసీఆర్ కి కేటాయించిన ఛాంబర్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. ఈ రోజు గురువారం మీడియాతో మాట్లాడిన శాసనసభా వ్యవహారాల మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్పీకర్‌పై ఉన్న గౌరవంతోనే బీఆర్‌ఎస్ ప్రతిపక్ష నేతకు పెద్ద ఛాంబర్‌ను కేటాయించిందని అన్నారు

Telangana: గత అసెంబ్లీ ఎన్నికలో గజ్వేల్‌ శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్ ఈ మధ్యే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ ఛాంబర్‌ను మార్చేసింది. దీన్తప్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రతిపక్ష నేతకు ఇస్తున్న కార్యాలయాన్ని కాకుండా చిన్న రూమ్‌ను కేటాయించారంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేటాయించిన ఛాంబర్‌ను రెండో సమావేశాల్లోపే మార్చేసింది అని ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

అసెంబ్లీలో కేసీఆర్ కి కేటాయించిన ఛాంబర్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. ఈ రోజు గురువారం మీడియాతో మాట్లాడిన శాసనసభా వ్యవహారాల మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్పీకర్‌పై ఉన్న గౌరవంతోనే బీఆర్‌ఎస్ ప్రతిపక్ష నేతకు పెద్ద ఛాంబర్‌ను కేటాయించిందని అన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న ఛాంబర్ ఇచ్చినట్లు ఆరోపించారు. ఇది అవమానకరం. కాంగ్రెస్‌కు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలున్నప్పుడు కూడా మేము పెద్ద ఛాంబర్‌లను కేటాయించామన్నారు.

కేసీఆర్ కి కేటాయించిన చిన్న ఛాంబర్ నిర్ణయంపై పునరాలోచించి కేసీఆర్‌కు పెద్ద ఛాంబర్‌ కేటాయించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల విషయంలో ప్రొటోకాల్ ఉల్లంఘించిన సందర్భాలను కూడా ఆయన ఎత్తిచూపారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే అనే విషయాన్ని అధికారులు మరిచిపోతున్నారు. ఓడిపోయిన పోటీదారుడి భార్యకు అధికారులు ప్రోటోకాల్ ఇచ్చారు. అక్కడి స్థానిక ఆర్డీఓ కూడా ఇలాగే వ్యవహరించారు. రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, ముఖ్యమంత్రులు మారతారు, అయితే కార్యాలయాలకు ఎన్నికైన వారి ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించరాదని డిజిపి పరిస్థితిని సీరియస్‌గా పరిగణించి, వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.

Also Read: YS Sharmila : వైఎస్ షర్మిలకు భద్రత పెంపు ..