Site icon HashtagU Telugu

Congress TV Ads : కాంగ్రెస్ ప్రచారం ఫై ఈసీ కి బిఆర్ఎస్ పిర్యాదు

Brs Complaint To Ec On Cong

Brs Complaint To Ec On Cong

టీవీలలో ప్రసారం అవుతున్న కాంగ్రెస్ యాడ్స్ (Congress TV Ads) ఫై బీఆర్ఎస్ (BRS) లీగల్ టీమ్ సోమాభరత్ ఈసీ (EC) కి పిర్యాదు చేసారు. ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే అన్ని రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, ఫ్లెక్సీలు, కరపత్రాలు, పోస్టర్లు ఇలా పలు వాటితో ప్రచారం చేస్తూ ఉండేవారు..కానీ ఇప్పుడు అంత సోషల్ మీడియా హావ నడుస్తుంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండడంతో ప్రపంచంలో ఏంజరిగిన క్షణాల్లో కళ్లముందు కనిపిస్తుంది. దీంతో రాజకీయ పార్టీలు సైతం సోషల్ మీడియా లో ఎన్నికల ప్రచారంలో బాగా వాడుకుంటున్నారు. కాగా టీవీ లలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం పట్ల బీఆర్ఎస్ లీగల్ టీమ్ సోమా భరత్ ఈసీ కి పిర్యాదు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

టీవీ యాడ్స్ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల కోడ్ అతిక్రమించిందని బీఆర్ఎస్ లీగల్ టీమ్ సోమా భరత్ తెలిపారు. ‘ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వకుండానే ఇచ్చినట్లు మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికల నుంచి ఆ వీడియోలను తెప్పించాం. కాంగ్రెస్ పార్టీ యాడ్స్‌పై ఈసీకి ఫిర్యాదు చేశాం. కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇక నుంచి ఇలాంటి పనులు అపుకోవాలని.. లేదంటే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. యాడ్స్‌పై సాయంత్రంలోపు ఈసీ ఆర్డర్స్ ఇస్తామని చెప్పింది. స్టార్ క్యాంపెయినర్స్ భాష పద్ధతిగా ఉండాలని ఈసీ సూచన చేసింది’ అని భరత్ మీడియా కు తెలిపారు.

మరోపక్క సోషల్ మీడియా ఫ్లాట్‌లో ఏ సైట్ ఓపెన్ చేసినా కేసీఆర్ ఫోటో ప్రత్యక్షం అయ్యేలా ప్రకటనలు వస్తున్నాయని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు. తమకే ఓటు వేయాలంటూ ట్రూకాలర్, వాట్సాప్‌లలో రిక్వెస్టులు వస్తుండగా, యూట్యూబ్‌లో చూసే సినిమాల్లోనూ బీఆర్ఎస్‌కు అనుకూలంగా ప్రకటనలు వస్తున్నాయని ఈ యాడ్లపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి అన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఏదానిని వదిలిపెట్టకుండా ప్రచారం చేస్తూ జనాలను ఆకట్టుకునే పనిలోపడ్డారు. మరి జనాలు యాడ్స్ చూసి ఓట్లు వేస్తారా..? లేక ఎవరు చక్కటి పాలన అందిస్తారని ఓటు చేస్తారో చూడాలి.

Read Also : AP TDP : జ‌గ‌న్ మెప్పుకోసం సీఐడీ, ఇంటిలిజెన్స్ ప‌ని చేస్తున్నాయి – మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌