Site icon HashtagU Telugu

Runa Mafi : నీతులు మందికి చెప్పుడేనా.. తమరు ఏమన్న పాటించేది ఉన్నదా..? రేవంత్ కు బిఆర్ఎస్ సూటి ప్రశ్న

Cng Paper Ads

Cng Paper Ads

తెలంగాణ రైతులంతా (All Telangana farmers) ఎప్పటి నుండి ఎదురుచూస్తున్న రైతు రుణమాఫీ (Runa Mafi)..మరికాసేపట్లో రేవంత్ సర్కార్ (Revanth Govt) ప్రారభించబోతుంది. తాము అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్..ఇప్పుడు ఆ మాట నిలుపుకునేందుకు సిద్ధమైంది. ఈరోజు రూ. లక్ష వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతు ఖాతాలో రుణమాఫీ సొమ్ము జమ చేస్తారు. ఈ నెలఖారులోగా రూ.లక్షన్నర వరకు రుణాలు చేయనున్నారు. ఆగస్టు 15 లోగా రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేయబోతున్నారు. రైతు రుణమాఫీ నిమిత్తం ప్రభుత్వం మొత్తం రూ. 31 వేల కోట్లు జమ చేయనుండగా.. మొత్తం 32 బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చాయి. రాష్ట్రంలో 90లక్షల రేషన్‌ కార్డులు ఉండగా రెండు లక్షల్లోపు రుణాలు ఉన్న వారిలో 70లక్షల మందికి రైతు రుణాలు ఉన్నాయి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక రుణమాఫీ నేపథ్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టారు. ఊరువాడా కాంగ్రెస్ జెండాలతో సందడి చేస్తున్నారు. ఇదే క్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీఎం రేవంత్ ఫై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం బిఆర్ఎస్ ఏ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టిన పలు న్యూస్ పేపర్స్ కు ప్రకటన ఇవ్వడం పట్ల రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ప్రజల సొమ్మును కేసీఆర్ ఇలా పేపర్ ప్రకటనలకు తగలబెడుతున్నాడని..ప్రజల డబ్బు అంటే కేసీఆర్ కు లెక్కలేదని ప్రతిపక్షంలో ఉన్న టైం లో రేవంత్ రెడ్డి పదే పదే విమర్శలు చేసేవారు. ఇప్పుడు అదే రేవంత్ ఈరోజు రుణమాఫీ సందర్బంగా అన్ని పేపర్లకు ప్రకటన ఇవ్వడం ఫై బిఆర్ఎస్ విరుచుకుపడింది.

“ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పొంకనాల పోటుగాడు మస్తు కథలు చెప్పిండు.. ఇప్పుడు అధికారంలోకి రాగానే సిగ్గు శరం లేకుండా కోట్ల రూపాయలు విలువ చేసే యాడ్స్ తో అన్ని ప్రధాన పత్రికల్లో మొదటి పేజీ నింపిండు. నీతులు మందికి చెప్పుడేనా.. తమరు ఏమన్న పాటించేది ఉన్నదా గుంపుమేస్త్రి? ” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి ట్వీట్ చేసింది బిఆర్ఎస్. ఇక సోషల్ మీడియా లోను బిఆర్ఎస్ శ్రేణులు, నెటిజన్లు రేవంత్ ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : AP People : పవన్ కళ్యాణ్ ఫై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా..?

Exit mobile version