Site icon HashtagU Telugu

Bhatti Vikramarka & Bandi Sanjay : ఒకే హెలికాప్టర్లో బండి సంజయ్ – భట్టి పర్యటన ఫై బిఆర్ఎస్ విమర్శలు

Bhatti Vikramarka & Bandi S

Bhatti Vikramarka & Bandi S

Bhatti Vikramarka & Bandi Sanjay In Same Helicopter : వారం రోజుల క్రితం తెలంగాణ (Telangana) లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం (Khammam) , మహబూబాబాద్ (Mahabubabad) లో గతంలో ఎన్నడూ లేని విధముగ ఒకే రోజు రికార్డు స్థాయిలో వర్షం పడడంతో రెండు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. వీటితో పాటు అనేక జిల్లాలో చెరువులకు , వాగులకు గండి పడి వరద నీరు ఇళ్లలోకి వచ్చాయి. పలు చోట్ల చెట్లు, కరెంట్‌ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఈ వరదలకు అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.

ఖమ్మం జిల్లాలో వరద తీవ్రత ఎక్కువగా ఉండడం తో జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Ministers )పర్యటించారు. ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు ఏరియల్ సర్వే(Aerial Survey) ద్వారా పరిశీలించారు. అనంతరం అక్కడ నుంచి కేంద్ర మంత్రులు పాలేరు వెళ్లి వరద పరిస్థితులపై ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

వరద సమయంలో హెలికాప్టర్ ఎవ్వరు కానీ ఒకే హెలికాప్టర్ లో ఇద్దరు

కాగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్తో (Minister Shivraj Singh Chauhan) కలిసి ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు డిప్యూటీ సీఎం భట్టి, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bhatti Vikramarka & Bandi Sanjay) ఒకే హెలికాప్టర్లో బయలుదేరడంపై బిఆర్ఎస్ విమర్శలకు దిగింది. వీరు వరద సమయంలో ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్ను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కానీ, ఇప్పుడు వీరిద్దరూ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారని, బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటేనని సెటైర్లు వేయడం స్టార్ట్ చేసింది.

Read Also : Jani Master : వరదల్లో జానీ మాస్టర్.. నడుములోతు నీళ్ళల్లో బాధితుల్ని పరామర్శిస్తూ.. 500 మందికి సాయం..