Site icon HashtagU Telugu

KCR: రేవంత్ రెడ్డే సీఎంగా ఉండాలి..! కేసీఆర్ ఎందుక‌లా అన్నారు.. గులాబీ బాస్‌ వ్యూహం ఏమిటి?

Kcr

Kcr

KCR: కేసీఆర్ అన్నా.. బీఆర్ఎస్ పార్టీ అన్నా సీఎం రేవంత్ రెడ్డి ఒంటికాలుపై లేస్తారు. ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో ఉతికారేస్తారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి బీఆర్ఎస్ ప‌దేళ్ల హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌ను వెలికితీస్తున్నారు. ఫ‌లితంగా బీఆర్ఎస్ నేత‌ల‌ను, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కేసీఆర్‌, కేటీఆర్ ల‌కు స‌హ‌క‌రించిన అధికారుల‌పైనా కొర‌డా ఝుళిపిస్తున్నారు. మ‌రోవైపు ప‌లు కేసుల్లో త్వ‌ర‌లో కేటీఆర్‌ను జైలు పంపిస్తామ‌ని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే చెబుతున్నారు. అయితే, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఐదేళ్లు పూర్తిగా అధికారంలో ఉండాలి.. రేవంత్ రెడ్డే సీఎంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read: Smita Sabharwal: స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ .. ఫొటోలు, వీడియోలు షేర్‌.. ఎందుకంటే?

ఏప్రిలో 27న పార్టీ రజతోత్సవ ఉత్సవాలను భారీగా నిర్వ‌హించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో జిల్లాల వారీగా నేత‌ల‌తో కేసీఆర్‌ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఐదేళ్లు పూర్తిస్థాయిలో అధికారంలో ఉండాలి.. రేవంత్ రెడ్డే ముఖ్య‌మంత్రిగా కొన‌సాగాల‌ని కేసీఆర్ అభిప్రాయ‌ప‌డిన‌ట్లు తెలిసింది. కేసీఆర్ పార్టీ అంతర్గత సమావేశాల్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ కేసీఆర్ అలా ఎందుకన్నారు..? రేవంత్‌నే సీఎంగా చూడాలని ఎందుకు కోరుకుంటున్నారు..? అటు బీఆర్ఎస్‌తో పాటు ఇటు కాంగ్రెస్‌ లీడర్లూ ఈ విషయమై జోరుగా చర్చించుకుంటున్నారు.

Also Read: Fuel Prices : ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలి – KTR

కేసీఆర్ అలా అన‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఉంద‌ట‌. ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర స్థాయిలో వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ట్లు కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. ఆయ‌నకు వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ ప్ర‌కారం కాంగ్రెస్ ప్ర‌భుత్వం విధానాల ప‌ట్ల ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని, బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉంటే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కావ‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని కేసీఆర్ అభిప్రాయం. రేవంత్ రెడ్డి పాల‌న రెండేళ్లు పూర్తికాక‌ముందే ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేఖ‌త వ‌స్తుంద‌ని, మ‌రో మూడేళ్లు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి ఉండి.. రేవంత్ రెడ్డి సీఎంగా కొన‌సాగితే బీఆర్ఎస్ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అవుతుంద‌ని కేసీఆర్ భావ‌న‌గా బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. ఇప్పటికే పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనను సరిపోల్చుకుంటున్న ప్ర‌జలు.. మరో మూడున్నరేళ్లలో కచ్చితంగా కాంగ్రెస్ పాల‌న‌పై విసిగిపోతారని గులాబీ బాస్ కేసీఆర్ అంచనా వేస్తున్నారని పార్టీవర్గాల్లో చర్చ నడుస్తోంది.