Site icon HashtagU Telugu

KCR: త్వరలో గులాబీ బాస్ యాక్టివ్, పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్

KCR Injured

Will Kcr's Unexpected Strategies Work

KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి గాయమై కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల కర్రసాయంతో నడుస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ముందుగా పార్టీ నాయకులు మంతనాలు సాగిస్తారు. ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎమ్మెల్సీల భాగస్వామ్యం, పార్టీ శ్రేణుల సమన్వయం వంటి అంశాలపై కేసీఆర్ చర్చించే అవకాశాాలున్నాయి.

అన్ని స్థాయిల్లో పార్టీ క్యాడర్‌ను ఏకతాటిపైకి తేవటంలో ఎమ్మెల్సీలు చురుకైన పాత్ర పోషించాలే సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. పార్టీని గ్రామస్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు పునర్వ్యవస్థీకరించాలనేది పార్టీ అధినేత కేసీఆర్‌ ఆలోచనా విధానమని, అందుకు అనుగుణమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని చెప్పారు.

పార్టీ అధినేత కేసీఆర్‌ త్వరలో ఎమ్మెల్సీలతో సమావేశమవుతారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇప్పటికే స్పస్టం చేశారు. ఆ సమావేశంలోనే శాసనమండలిలో పార్టీ నా యకుడి ఎంపిక ఉంటుందని చెప్పారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమని, అప్పుడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉంటాయని వివరించారు.  జిల్లా పార్టీ కార్యాలయాల కేంద్రంగా కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అన్యూహంగా ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్, అటు కేంద్రంలో బీజేపీ లాంటి జాతీయ పార్టీలను ఢీకొట్టాలంటే ముమ్మరంగా శ్రహించాల్సి ఉంటుంది. కేసీఆర్ వస్తేనే పార్టీ శ్రేణులు ఈజీ అవుతుంది. లోక్​సభ సన్నాహక సమావేశాలు ముగిసిన తర్వాత పార్టీ కార్యాచరణను కేసీఆర్ నిర్ణయిస్తారు కూడా.  2009 నుంచి వరుసగా మూడు లోక్​సభ ఎన్నికల్లో మహబూబ్​నగర్​ లోక్​సభ సీటు బీఆర్ఎస్ గెలుచుకుంది. 2009లో కేసీఆర్ మహబూబ్​నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పడింది కూడా. పార్లమెంట్​లో తెలంగాణ గొంతు బలంగా వినిపించాలంటే ఎంపీలుగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.