Site icon HashtagU Telugu

BRS : తెలంగాణ లో బిఆర్ఎస్ – కాంగ్రెస్ పోటాపోటీగా ప్రాజెక్టుల పర్యటనలు

Brsmedigadda

Brsmedigadda

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీలు ప్రజల సమస్యల ఫై యుద్ధం మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..ఈసారి లోక్ సభ ఎన్నికలతో సత్తా చాటుకోవాలని చూస్తుంటే..కాంగ్రెస్..గత ఎన్నికల విజయం మాదిరే ఈసారి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించాలని చూస్తుంది. ఇందుకుగాను ఇరు పార్టీలు బరిలోకి దిగుతున్నాయి.

గత కొద్దీ రోజులుగా మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెస్ పెద్ద రాద్ధాంతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చలో మేడిగడ్డ పిలుపునిచ్చింది బిఆర్ఎస్. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మినహా మిగిలిన నాయకులంతా, తెలంగాణ భవన్​ నుంచి మేడిగడ్డకు బయలుదేరారు. బస్సుల్లో, కార్లలో పయనమయ్యారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శన తరవాత నేతలు అన్నారం బ్యారేజీ పరిశీలన చేయనున్నారు. అనంతరం అన్నారం వద్ద కేటీఆర్ పవర్​పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాళేశ్వరం ప్రాజెక్టుపై బాధ్యత మరచి కాంగ్రెస్‌ ప్రభుత్వం దుష్ట రాజకీయాలు చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. ప్రజలకు కాళేశ్వరం గొప్పదనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూడటానికి, ఎండాకాలంలో ప్రజలు గొంతులు ఎండగా చూడటానికే తాము చలో మేడిగడ్డ పర్యటన చేపట్టామని తెలిపారు. ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ కాలరాసే ప్రయత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్ నీచ సంసృతిని ఎండగట్టేందుకే మేడిగడ్డ సందర్శన అన్నారు. బాధ్యతను మరిచిన ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేస్తామని చెప్పారు.

ప్రభుత్వం తన బాధ్యతను మరిచిపోయిందన్నారు. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేందుకే మేడిగడ్డ సందర్శన అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రిజార్వాయర్లను బీఆర్ఎస్ నేతలతో కలిసి సందర్శిస్తామని చెప్పుకొచ్చారు. కుంగిపోయిన పిల్లర్లను బాగుచేయాల్సింది పోయి..బీఆర్ఎస్ పై దుమ్మేత్తి పోసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. నీళ్లు వదలకుండా తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇదిలా ఉంటె బిఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ ఈరోజు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ను పరిశీలించేందుకు కాంగ్రెస్ నేతలు బయలుదేరుతున్నారు.

Read Also : BJP Lok Sabha Candidates: నేడు బీజేపీ తొలి జాబితా..? 100 మందికిపైగా అభ్య‌ర్థుల‌తో లిస్ట్, మ‌రోసారి వార‌ణాసి నుంచి మోదీ..?