Site icon HashtagU Telugu

MLA Defection Case : హైకోర్టు తీర్పు పట్ల బిఆర్ఎస్ సంబరాలు..ఎమ్మెల్యేలు మండిపాటు

Brs Celebrates The High Cou

Brs Celebrates The High Cou

MLA Defection Case : బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు (Disqualification Of MLAs ) వేసేలా ఆదేశాలివ్వాలని బిఆర్ఎస్ , బీజేపీలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. స్పీకర్‌ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు సోమవారం తీర్పు (High Court Verdict) తీర్పునిచ్చింది. నాలుగు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతామంది.

హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఫై బిఆర్ఎస్ సంబరాలు చేసుకుంటుంటే..అనర్హత వేటు ఎమ్మెల్యేలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని, ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్ల‌పై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్ర‌జాస్వామిక‌ విధానాల‌కు చెంపపెట్టు అని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురికావ‌డం త‌థ్యమ‌న్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పు ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిల‌బెట్టే విధంగా ఉంద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురై ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు రావ‌డం ఖాయ‌మ‌న్నారు. అన‌ర్హ‌త కార‌ణంగా ఉప ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ త‌ప్ప‌కుండా గెలుస్తుంద‌న్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) మాత్రం హైకోర్టు తీర్పు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బిఆర్ఎస్ కు లేదని దుయ్య బట్టారు. రాజకీయాలను ఆ పార్టీ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. కోర్టు తీర్పును అధ్యయనం చేయాల్సిన అవసరముందన్నారు. అవసరమైతే డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తామని తెలిపారు. గతంలో కాంగ్రెస్, సీపీఐ, వైసీపీ, టీడీపీ నాయకులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుందని మండిపడ్డారు.

Read Also : CM Revanth inaugurate IIHT: ఐఐహెచ్‌టీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి