BRS : ప్రచారంలో కంట్రోల్ తప్పుతున్న బిఆర్ఎస్ అభ్యర్థులు..ఓటర్లపై ఆగ్రహం

సమస్యల పరిష్కారం, పథకాల లబ్ధిపై ప్రజలు నిలదీయడం తో అభ్యర్థుల సహనానికి పరీక్షగా మారింది. దాన్ని జీర్ణించుకోలేక, సమాధానం చెప్పుకోలేక, అవమానాలను భరించలేక

Published By: HashtagU Telugu Desk
Brs Mlas

Brs Mlas

పదేళ్ల గా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ (BRS) నేతలు మరోసారి తమకు ఛాన్స్ ఇవ్వండి అంటూ ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈసారి కూడా చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే (BRS Sitting MLAS) గులాబీ బాస్ ఛాన్స్ ఇచ్చాడు. మొదటి నుండి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రజల్లో వ్యతిరేకత ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇస్తే ఓటు వేయమని చెపుతూ వచ్చారు. అయినప్పటికీ కేసీఆర్ వారికే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో వారి ప్రచారంలో ప్రజలు నిలదీస్తున్నారు. మా ఊరికి ఏంచేశారని నిలదీస్తున్నారు. గత ఎన్నికల్లో కనిపించవు..మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నావు అంటూ ఎక్కడికక్కడే ప్రశ్నిస్తున్నారు. దీంతో కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు కంట్రోల్ తప్పుతున్నారు. ప్రశ్నించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సమస్యల పరిష్కారం, పథకాల లబ్ధిపై ప్రజలు నిలదీయడం తో అభ్యర్థుల సహనానికి పరీక్షగా మారింది. దాన్ని జీర్ణించుకోలేక, సమాధానం చెప్పుకోలేక, అవమానాలను భరించలేక కొంతమంది నేతలు కంట్రోల్ తప్పుతున్నారు. సిగ్గు, శరం ఉంటే.. అంటూ డోర్నకల్ బీఆర్ఎస్ అభ్యర్థి (సిట్టింగ్ ఎమ్మెల్యే) రెడ్యానాయక్ (Dornakal BRS Candidate Redya Naik) నోరు జారారు. ఇది మీడియా లో , సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యింది. మక్తల్ ఎమ్మెల్యే (బీఆర్ఎస్ అభ్యర్థి) చిట్టెం రామ్మోహన్‌రెడ్డి (TRS Makthal MLA Chittem Ram Mohan Reddy)కూడా ‘ఇప్పుడు మీ వెనక తిరుగుతున్నా.. రేపటి రోజున మీరంతా నా వెనక తిరగాల్సి వస్తుంది..’ అంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అచ్చంపేట ఎమ్మెల్యే (బీఆర్ఎస్ అభ్యర్థి) సైతం ఎన్నికల ప్రచారంలో నిలదీస్తున్న ప్రజలను కాంగ్రెస్ కార్యకర్తలా.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరికొద్దిమంది అభ్యర్థులు సైతం ఇదే తీరులో నియంత్రణ కోల్పోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

గత ఎన్నికల్లో అనుకూలంగా ఓటు వేసిన ప్రజలే ఈసారి ఎదురుతిరగడం, ప్రశ్నించడం, నిలదీయడం, గ్రామం నుంచి తరిమేస్తుండడం లాంటివి చోటుచేసుకోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. నిన్నమొన్నటివరకూ కాంగ్రెస్ పార్టీపైన విమర్శలకు మాత్రమే పరిమితమైన గులాబీ అభ్యర్థులు ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి ఎవరో తేలిపోవడంతో వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలే చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఇది వారికే కాదు పార్టీకి కూడా నష్టమని అంత వాపోతున్నారు.

Read Also : High Tension In Kodangal : కొడంగల్ లోఉద్రిక్తత…

  Last Updated: 15 Nov 2023, 10:43 AM IST