Telangana Bapu KCR: తెలంగాణ బాపూ కేసీఆర్‌..? స‌రికొత్త ప్ర‌చారం స్టార్ట్ చేసిన బీఆర్ఎస్‌

గ‌తేడాది తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ప‌ది సంవ‌త్స‌రాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ మ‌రోసారి అధికారం నిల‌బెట్టుకోవ‌డంలో విఫ‌ల‌మైంది.

Telangana Bapu KCR: గ‌తేడాది తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ప‌ది సంవ‌త్స‌రాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ మ‌రోసారి అధికారం నిల‌బెట్టుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 64 సీట్లు కైవ‌సం చేసుకుని అధికారంలోకి రాగా బీఆర్ఎస్ 39 స్థానాల్లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. ప్రస్తుతం ప్ర‌తిప‌క్ష పార్టీ హోదాలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీ ఎన్నిక‌ల్లో అయినా విజయం సాధించాల‌ని చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌చార జోరు పెంచింది. అయితే బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ బాపుగా వ‌ర్ణిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అయితే బీఆర్ఎస్ నాయ‌కులు కేసీఆర్‌ను జాతిపిత బాపూ అంటూ ప్ర‌చారం చేయ‌టం మొద‌లుపెట్టారు. తెలంగాణ‌లో ఓడిపోవ‌డం, ఫోన్ ట్యాపింగ్‌, కాళేశ్వ‌రంలాంటి ప‌లు అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్‌, కేసీఆర్ ప్ర‌తిష్ట‌ను పెంచాల‌ని బీఆర్ఎస్ నాయ‌కులు బాపూ అని ప్ర‌చారం మొద‌లుపెట్టారు. తెలంగాణ వ‌చ్చి ప‌ది సంవ‌త్సరాలు దాటిన ఆ ఉద్య‌మ తీరును మ‌రోసారి రెచ్చ‌గొట్టెందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఈ విధంగా ప్ర‌చారం మొద‌లు పెడుతున్నారు.

We’re now on WhatsAppClick to Join

అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేసిన ఈ వీడియోపై నెటిజన్లు, ఇతర పార్టీ నాయకులు విమర్శలు కురిపిస్తున్నారు. గత పదేళ్లగా తెలంగాణ బాపూ తెలంగాణకు ఏం చేశాడని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఏమో ఈ వీడియోకు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

Also Read: Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు మళ్ళీ నిరాశే..బెయిల్ పిటిషన్ రిజర్వ్

Follow us