KCR Driving Omni: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఫొటో.. పాత ఓమ్ని వ్యాన్ నడిపిన గులాబీ బాస్ కేసీఆర్‌..!

  • Written By:
  • Updated On - June 27, 2024 / 04:33 PM IST

KCR Driving Omni: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫాం హౌస్‌కే పరిమితమయ్యారు. నేతల ఫిరాయింపుల నేపథ్యంలో ఆయన మరింత డీలాపడ్డారని అంతా అనుకున్నారు. అయితే తాజాగా తన ఫాంహౌస్‌లో సరదాగా ఓ పాత ఓమ్ని వ్యాన్ (KCR Driving Omni) నడిపారు. టోపీ ధరించి కారు డ్రైవింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సార్‌ మళ్లీ కారు నడపటం మొదలెట్టారని నెటిజన్స్ అంటున్నారు.

కేసీఆర్ తన ఫాంహౌస్‌లో ఓమ్ని వ్యాన్ నడుపుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన కారు నడపడానికి ఓ కారణం ఉందట. తుంటి ఆపరేషన్ తర్వాత కర్ర సహాయం లేకుండా కేసీఆర్ న‌డుస్తున్నారు. అయితే మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్లు ఇటీవల సూచించారు. దీంతో తన పాత ఓమ్నీ వ్యాన్‌ను గురువారం న‌డిపారు. కాగా, డిసెంబ‌ర్ 8న అర్ధ‌రాత్రి కేసీఆర్ కాలు జారిప‌డిన విష‌యం తెలిసిందే. అనంత‌రం గులాబీ బాస్‌ను సోమాజిగూడ‌లోని య‌శోదా ఆస్ప‌త్రికి కుటుంబ స‌భ్యులు త‌ర‌లించి చికిత్స చేపించారు. అయితే గాయం తీవ్ర‌త ఎక్కువ ఉండ‌టంతో కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడిని య‌శోదా ఆస్ప‌త్రి వైద్యులు చేయాల్సి వ‌చ్చింది. అయితే ఆప‌రేష‌న్ త‌ర్వాత ఆయ‌న వాకింగ్ స్టిక్ సాయంతో న‌డిచిన కొన్ని చిత్రాలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.

Also Read: Heavy Rain In Hyderabad: హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం..!

ఈ క్ర‌మంలోనే మాజీ సీఎం కేసీఆర్ ఓమ్నీ కారు నడుపుతున్న ఫోటో ఈరోజు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. కేసీఆర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారని, కర్ర సాయం లేకుండా నడుస్తున్నారని తెలుస్తోంది. అయితే కేసీఆర్ కాలు పరిస్థితిని తనిఖీ చేయడానికి మాన్యువల్ కారును నడపాలని వైద్యులు సూచించారు. వారి సూచన మేరకు కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో పాత ఓమ్నీని నడిపారు. ఇక‌పోతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కుదుపుల ద‌శ‌లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి మారుతున్నారు. ఈ విధంగా పార్టీ ఇప్ప‌టికే ఐదుగురు ఎమ్మెల్యేలను కోల్పోయింది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో పార్టీ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థకంగా మిగిలింది.

We’re now on WhatsApp : Click to Join