Site icon HashtagU Telugu

BRS Booklet: కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ బుక్ లెట్, 420 హామీలు అంటూ ప్రచారం!

Brs Booklet

Brs Booklet

BRS Booklet: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన అడ్డగోలు హామీలపైన భారత రాష్ట్ర సమితి ఒక బుక్లెట్ ని ప్రచురించింది. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మోసపూరితంగా ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలు ఇచ్చి ఈరోజు వాటి అమలుపైన ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో ఆ హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తుచేసేలా ఈ బుక్లెట్ ని తయారు చేశామని ఆరోపించింది.

వందల కొద్ది హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాత్రం కేవలం ఆరు హామీల మాట జపిస్తుందని, ఆరు హామీలు కాదు ఇచ్చింది 420 హామీలు అంటూ, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో పాటు వివిధ డిక్లరేషన్ల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒకచోట చేర్చి ఈ బుక్లెట్ ని ప్రచురించింది. కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా ఇచ్చిందో లేదా తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు నిర్ణయించి ముందే డిసైడ్ అయిందో తెలవదు కానీ మోసానికి మారుపేరుగా నిలిచే 420 నంబర్ తీరుగా ఈ హామీలు ఉన్నాయన్నారు నేతలు అన్నారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసేలా కార్యక్రమాలు ప్రారంభించాలని… కేవలం సాగదీసే ప్రక్రియలకు పాల్పడకుండా … రానున్న లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే ఎన్నికల ప్రచారంలో తేదీలతో సహా చెప్పినట్లు మాటకు కట్టుబడి ఉండి హామీలను నెరవేర్చాలని పార్టీ పేర్కొంది. కేవలం 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకొస్తామని పార్టీ తెలిపింది.

Exit mobile version