Site icon HashtagU Telugu

Malkajgiri BRS Candidate : మల్కాజ్ గిరి బిఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఎవర్ని దింపుతాడో..?

Malkajgiri Brs Candidate

Malkajgiri Brs Candidate

తెలంగాణలో డిసెంబర్ 07 న అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Election 2023) జరగబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ తరుణంలో అన్ని పార్టీ లు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. మరోపక్క అన్ని పార్టీలలో వలసలు మొదలయ్యాయి. అయితే అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) కు మాత్రం వరుస షాకులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరం మొదలుపెట్టాలని భావించింది..అలాగే అందరి కంటే ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించింది. కానీ ఎప్పుడైతే అభ్యర్థులను ప్రకటించిందో అప్పటి నుండి వరుస షాకులు తగులుతున్నాయి.

గతంలో మాదిరిగానే చాలావరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కేటాయించారు గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR). కానీ నాల్గు , ఐదు చోట్ల కొత్త వారికీ ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఎక్కువ సంఖ్యలో మాత్రం పాతవారికే టికెట్ కేటాయించడం చాలామంది తట్టుకోలేకపోతున్నారు. ఇంతకాలం టికెట్ ఇస్తారనే ఆశతో పార్టీ కోసం పనిచేస్తే తమను పట్టించుకోరా అంటూ చాలామంది బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ (Congress) లో చేరుతున్నారు. తాజాగా మల్కాజ్ గిరి (Malkajgiri) బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు (Mynampally Hanumantha Rao) పార్టీ కి రాజీనామా చేసారు. దీనికి కారణం తన కొడుక్కు మెదక్ టికెట్ ఇవ్వలేదని..అదే కారణం తో ఆయన బిఆర్ఎస్ కు రాజీనామా చేసారు. రేపు కాంగ్రెస్ లో చేరబోతున్నారు.

ఇప్పుడు మల్కాజ్ గిరి బిఆర్ఎస్ అభ్యర్థిగా (Malkajgiri BRS Candidate) కేసీఆర్ ఎవర్ని దింపుతాడో..? అనేది చర్చ గా మారింది. మైనంపల్లి హన్మంతురావు ను ఎదురుకోవాలంటే..అదే స్థాయిలో అభ్యర్థి ఉండాలి..అప్పుడే గెలుపు సాధ్యం అవుతుంది. ప్రస్తుతం మల్కాజ్ గిరి స్థానం కోసం పలువురు పోటీ పడుతున్నారు. చింతల కనకా రెడ్డి కోడలు కార్పొరేటర్ విజయశాంతి రెడ్డి, మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పోటీ పడుతున్నారు. ఓసి, బిసి, మహిళ ఓట్లు తమకు అనుకూలంగా మారే విధంగా మల్కాజిగిరిలో అభ్యర్థిని ప్రకటిస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతామని బిఆర్ఎస్ అధిష్టానం భావిస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తో కేటీఆర్ సుదీర్ఘంగా చర్చించారని విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటినుండి మల్కాజిగిరి టికెట్ రాజశేఖర్ రెడ్డి కి ఇచ్చారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అధిష్టానం అభ్యర్థి పేరు ప్రకటించే వరకు మల్కాజిగిరి అభ్యర్థి ఎవరో అనేది ఆసక్తి గా ఉంటుంది.

Read Also : Amaravati Inner Ring Road Case : యువగళం కు భయపడే సీఎం జగన్ తప్పుడు కేసు పెట్టాడు – నారా లోకేష్