Site icon HashtagU Telugu

CM KCR: కేసీఆర్ లో మార్పు! అందుకేనా?

Rebelling Against Modi Is Kcr's Cleverness

Rebelling Against Modi Is Kcr's Cleverness

CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ లో ఒకింత మార్పు కనిపిస్తుంది. బీజేపీ విషయంలో ఆయన ఎందుకో వెనుకడుగు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. రెండుళ్లుగా కేంద్రంపై పోరాడుతున్న కెసిఆర్ ఇప్పుడు కేంద్రంతో దోస్తీకి సిద్దమైనట్లు కనిపిస్తుంది. తాజాగా మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో పలు భేటీలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

వాస్తవానికి మణిపూర్ పరిస్థితిపై కేంద్రం పలు రాష్ట్రాల నుంచి నేతలను ఆహ్వానించింది. ఈ సమావేశానికి భారత రాష్ట్ర సమితి తరపున సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ బి.వినోద్ హాజరయ్యారు. గత రెండేళ్లుగా కేంద్రం పిలిచిన సమావేశాలకు కేసీఆర్, ఆయన పార్టీ దూరంగా ఉండడం కనిపించింది. కాగా పాట్నాలో 17 భాజపాయేతర పార్టీలు పిలిచిన సంయుక్త సమావేశం ముగిసిన ఒక రోజు తర్వాత, కేంద్రం ఆహ్వానం మేరకు ఆయన పార్టీ ఎంపీ వెళ్లడం చర్చకు దారి తీసింది. కొద్ది రోజుల క్రితం వరకు కేసీఆర్ స్వయంగా బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్‌కు నాయకత్వం వహించినప్పటికీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశానికి సైతం ఆయన దూరంగా ఉన్నారు.

ఇక కేసీఆర్ తనయుడు, తెలంగాణ మంత్రి కెటి రామారావు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న సందర్భంగా శుక్రవారం అంటే జూన్ 23న పాట్నాలో విపక్షాల సమావేశం జరుగుతోంది. ఆ సమయంలో ఆయన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా కెసిఆర్ లో మార్పు కేవలం ఆయన వ్యక్తిగత కారణాలే కారణమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత పేరు తెరపైకి రావడంతో ఈడీ కవితను రెండు సార్లు ప్రశ్నించింది. కేసీఆర్ కుమార్తె కవిత పేరును కూడా చార్జిషీట్‌లో చేర్చారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈ కార‌ణాల వ‌ల్ల కేసిఆర్ కేంద్రం వైపు మొగ్గు చూపిన‌ట్లు భావిస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఏప్రిల్‌లో దాఖలు చేసిన చార్జిషీట్‌లో కవిత పేరును తొలగించారు.

Read More: Gold Bank India : గోల్డ్ బ్యాంక్ ఇండియా.. ఎందుకో తెలుసా ?