Kaleshwaram ATM: రాహుల్ కాళేశ్వరం ATM వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎటాక్

తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ల మధ్య పోటీ నెలకొంది. అధికారమే ద్వేయంగా విమర్శలు, ప్రతివిమర్శలు పాల్పడుతున్నారు ఆయా రాజకీయ నేతలు.

Kaleshwaram ATM: తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ల మధ్య పోటీ నెలకొంది. అధికారమే ద్వేయంగా విమర్శలు, ప్రతివిమర్శలు పాల్పడుతున్నారు ఆయా రాజకీయ నేతలు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలకు దిగారు. కేసీఆర్ కాళేశ్వరంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎటాకింగ్ మొదలు పెట్టింది.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను దోచుకుంటున్నారని, కేసీఆర్‌, ఆయన కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టును తమ వ్యక్తిగత ఏటీఎంగా వాడుకుంటున్నారని రాహుల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ అవినీతిపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రాహుల్‌గాంధీ ఏదైనా మాట్లాడే ముందు తాను ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లుగా ఎంతో అభివృద్ధి చేసి చుపించాము. కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న అయిన రాహుల్ గాంధీ, పార్టీ బాధ్యతాయుతమైన నాయకుడిగా ఏదైనా మాట మాట్లాడే ముందు ఆయన ఏం మాట్లాడుతున్నారో క్షుణ్ణంగా గమనించాలని సూచించారు.

కాంగ్రెస్ అధికారం చెలాయిస్తున్న రాష్ట్రాలలో కాంగ్రెస్ ఏ పనీ చేయలేదని రంజిత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అద్భుతాలు చేశారని చెప్పారు. కేసీఆర్ మాదిరిగా మీరు పాలిస్తున్న ఒక్క రాష్ట్రంలోనైనా ఇలాంటి అద్భుతాలు చేసి చూపించాలని, అప్పుడు కేసీఆర్‌ను మీ రాష్ట్రంలోకి పిలిచి మీ అభివృద్ధిని చూపించండని తెలిపారు.

ఇదిలా ఉండగా తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉత్కంఠభరితమైన ముక్కోణపు పోటీ నెలకొంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 88 స్థానాల్లో బీఆర్‌ఎస్ 47.4 శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్ 19 సీట్లు, 28.7 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also Read: Sajjala : హైదరాబాదులో చంద్రబాబు అని చూసేందుకు వచ్చింది పచ్చ బ్యాచ్ మాత్రమే – స‌జ్జ‌ల‌