Site icon HashtagU Telugu

BRS vs Congress : హద్దులు దాటుతున్న ట్రోల్స్‌..!

Brs Vs Congress

Brs Vs Congress

రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. అయితే.. విమర్శలకు ప్రతివిమర్శలూ ఉంటాయి. అయితే.. ఇవి హద్దులు దాటనంతవరకు ఓకే కానీ.. ఓ స్థాయిని మించి విమర్శలు చేసుకుంటే.. చూసేవారికే కాదు.. వినేవారికీ ఇబ్బందిగానే ఉంటుంది. అయితే.. సార్వత్రిక ఎన్నికలకు నేటికి కేవలం నెల రోజులు మాత్రమే ఉన్నందున, ప్రముఖ పార్టీలు తమ సోషల్ మీడియా (Social Media) గేమ్‌ను పెంచాయి. సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని ట్రోల్స్‌ చేయడం ప్రారంభమైంది. అయితే, బీఆర్‌ఎస్‌ (BRS)-కాంగ్రెస్ (Congress) వారి తాజా సోషల్ మీడియా ఒకరిపై మరొకరు బురద జల్లుకోవడంలో హద్దులు దాటుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. మొదట కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), కవిత (Kavitha), హరీశ్ రావు (Harish Rao), సంతోష్‌ కుమార్‌ (Santosh Kumar)ల మార్ఫింగ్ ఫోటోను షేర్ చేసిన కాంగ్రెస్, దానికి “#దోపిడిగుంపు #కారుచౌకాగ్యాంగ్” అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ చిత్రంలో కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులు లుంగీల్లో కనిపిస్తుండగా, కవిత కారు పైభాగంలో కూర్చున్నారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాల గురించి చెప్పుకోవడానికి రేవంత్‌ (Revanth Reddy)కి సిగ్గు లేదని కేటీఆర్‌ ఇటీవల వ్యాఖ్యానించడంపై స్పందించారు.

దీనికి ప్రతిగా సోనియా గాంధీ (Sonia Gandhi), రాజీవ్ గాంధీ (Rajiv Gandhi)ల మార్ఫింగ్ ఫోటోతో బీఆర్‌ఎస్ బదులిచ్చారు. వారు ఈ చిత్రానికి “బార్ డాన్సర్స్ పార్టీ” అని క్యాప్షన్ ఇచ్చారు. ఇటలీలో బార్ డ్యాన్సర్‌గా పనిచేసిన సోనియా గాంధీ కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యులను, గాంధీ కుటుంబాలను ఈ మార్ఫింగ్ చేసిన కల్చర్‌ బాగా చూసేలా లేదు. నెటిజన్లు ఈ పార్టీల సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి మెరుగైన సోషల్ సెన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఒక స్థాయిలో ఉన్న నేతలను ఈ విధంగా మార్ఫింగ్‌ చేయడం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలనే కాకుండా సామాన్యులను సైతం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొవడానికి ఉన్నత స్థానంలో ఉన్నవారిని కించపరిచేవిధంగా పోస్టులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని నెట్టింటి సమాజం చర్చించుకుంటోంది.
Read Also : CM Revanth Reddy : నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం