Site icon HashtagU Telugu

BRS alliance : కేసీఆర్ మ‌హా కూట‌మి! రేవంత్ కు చిక్కులే!!

Brs Alliance

Brs Alliance

తెలంగాణ సీఎం కీల‌క స‌మావేశాన్ని(BRS alliance) ఏర్పాటు చేశారు. బుధ‌వారం ఆయ‌న‌ ఇచ్చే డైరెక్ష‌న్ కీల‌కం కానుంది. రెండు ఆప్ష‌న్ల‌ను వినిపించ‌బోతున్నార‌ని టాక్‌. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు(Before Elections) వెళ్లలేని ప‌రిస్థితుల్లో ప్ర‌స్తుతం కేసీఆర్(KCR) ఉన్నార‌ని ఢిల్లీ వ‌ర్గాల వినికిడి. అందుకే, షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని భావిస్తూ డైరెక్ష‌న్ ఇవ్వ‌డం మొద‌టి ఆప్ష‌న్. ఇక లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ ఎన్నిక‌లు కూడా వ‌స్తే ఏం చేయాలి? అనే దానిపై దిశానిర్దేశం చేయ‌డం రెండో ఆప్ష‌న్ కింద ఉంద‌ని తెలుస్తోంది.

తెలంగాణ సీఎం కీల‌క  డైరెక్ష‌న్ (BRS alliance)

మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడుకు 2004 ఎన్నిక‌ల ముందుగా ఎదురైన ప‌రిస్థితులు ఇప్పుడు కేసీఆర్ (KCR) ఫేస్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన‌ప్ప‌టికీ రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్ట‌డం ద్వారా లోక్ స‌భ ఎన్నిక‌ల వ‌ర‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను తీసుకెళ్లాల‌ని బీజేపీ ప్లాన్ గా ఉంద‌ని స‌మాచారం. క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత రాజ‌స్థాన్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, చ‌త్తీస్ గ‌డ్, తెలంగాణ ఎన్నిక‌లు ఈ ఏడాది చివ‌రినాటికి జ‌ర‌గాలి. సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పాటు ఆ రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం ద్వారా ల‌బ్ది పొంద‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని ఆయా రాష్ట్రాల బీజేపీ శాఖ‌ల అభిప్రాయంగా ఉంది. ఆ మేర‌కు ర‌హ‌స్య నివేదిక‌ల‌ను అధిష్టానంకు అంద‌చేశార‌ట‌. వాటిని ప‌రిశీలించిన బీజేపీ అధిష్టానం వీలున్నంత వ‌ర‌కు సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పాటు ఆ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను కూడా వాయిదా వేయించే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఒకేసారి ఎన్నిక‌ల‌ను

రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఒకేసారి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాలనే ప్ర‌తిపాద‌న కూడా ఉంది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముంద‌స్తుకు వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చాలా కాలంగా టాక్ ఉంది. ఆ దిశ‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని తీసుకొచ్చారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల కోసం ఏర్పాటు చేసే స‌భ‌ల‌ను కూడా రాజ‌కీయ స‌భ‌లుగా మార్చేశారు. ఆ వేదిక‌పై నుంచి రాజ‌కీయాల‌ను మాట్లాడుతున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను టార్గెట్ చేస్తున్నారు. ఎన్నిక‌ల వ‌ర‌కు రాజ‌కీయాలు అంటూ చెప్పిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫ‌క్తు రాజ‌కీయాల‌ను ప్ర‌స్తుతం మాట్లాడుతున్నారు. అంటే, ముంద‌స్తుకు వెళ్ల‌డానికి సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది. ఒక వేళ అదే జ‌రిగితే, మిగిలిన నాలుగు రాష్ట్రాల‌తో పాటు ఐదో రాష్ట్రం కింద ఏపీ ఉంటుంది. కానీ, సాధార‌ణ ఎన్నిక‌ల వ‌ర‌కు వేచి ఉండేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కూడా బీజేపీ మౌల్డ్ చేస్తుంద‌ని తెలుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏమి చేయాలి? అనే అంశంపై కేసీఆర్ (BRS alliance) దిశానిర్దేశం చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

బీజేపీయేతర పార్టీల‌తో జ‌త క‌ట్ట‌డానికి బీఆర్ఎస్ రెడీ(BRS alliance) 

బీజేపీయేతర పార్టీల‌తో జ‌త క‌ట్ట‌డానికి(BRS alliance) బీఆర్ఎస్ రెడీ అయింది. ఒక వేళ సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ ఎన్నిక‌లు ఉంటే, పొత్తు అనివార్యం కేసీఆర్ భావిస్తున్నార‌ని వినికిడి. క‌మ్యూనిస్ట్ లు, బీఎస్పీ, కాంగ్రెస్ తో క‌లిసి మ‌హా కూట‌మిగా ఏర్ప‌డాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇదే కూట‌మి ఏపీలోనూ ఉంటుంద‌ని క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. జాతీయ స‌మీక‌ర‌ణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రాల్లో భారీ త్యాగాల‌కు సిద్దం కావడానికి మానసికంగా త‌యారు అయింది. దానికి అనుగుణంగా బెంగాల్ సీఎం మ‌మ‌త కూడా బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీల‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాల‌ని సూచిస్తున్నారు. అంటే, తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీ, ఏపీలో టీడీపీ లేదా వైసీపీతో పొత్తు ఉండాల‌ని ఆమె కోరుకుంటున్నారు.

Also Read : BRS Plan: ఏపీలో BRS ఎత్తుగడ! కాంగ్రెస్ తో కలిసి మహా కూటమి దిశగా..!

కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తును గ్ర‌హించిన బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ముందుగా నిర్వ‌హించ‌డానికి స‌ర్వేలు చేయించుకున్నార‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే, బీజేపీకి రాజ్యాధికారం అంద‌నిద్రాక్ష‌గా మిగిలిపోతంద‌ని స‌ర్వేల సారాంశమ‌ట‌. అందుకే, సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పాటు ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను తీసుకెళ్లాల‌ని భావిస్తున్నాట్టు హ‌స్తిన ప్ర‌చారం. అంటే, మ‌హా కూట‌మికి(BRS alliance) కేసీఆర్ నాంది ప‌ల‌క‌నున్నారు. అందుకే, ఎమ్మెల్యేలు, ఎంపీలు త్యాగాల‌కు సిద్దం కావాల‌ని బుధ‌వారం క్యాడ‌ర్, లీడ‌ర్ల‌కు ఒక దిశానిర్దేశం చేశార‌ని తెలుస్తోంది.

Also Read : KCR: కర్ణాటక స్టోరీపై కేసీఆర్ తెలంగాణ స్క్రీన్ ప్లే