కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి రెండు రోజులు బ్రేక్ ఇచ్చారు. రేపు డిసెంబర్ 31, ఎల్లుండి కొత్త సంవత్సరం సందర్బంగా ఈ రెండు రోజులు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి బ్రేక్ ఇచ్చారు. తిరిగి జనవరి 2 నుండి మొదలుపెట్టనున్నారు. మరి జనవరి 06 వరకు దరఖాస్తుల స్వీకరణ చేస్తామని చెప్పిన ప్రభుత్వం..ఈ రెండు రోజులు సెలవు ప్రకటించడం తో..స్వీకరణ తేదీని పెంచుతారో లేదో చూడాలి.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణాలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ప్రస్తుతం ప్రజాపాలన (Praja Palana) కార్యక్రమం ద్వారా ఆరు పథకాలకు (6 Guarantees) సంబదించిన దరఖాస్తులను (Application Form) స్వీకరిస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేంద్రాల బాట పడుతున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తొలిరోజు గురువారం 7.46 లక్షల దరఖాస్తులు రాగా, రెండో రోజైన శుక్రవారం 8.12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువ మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు.
ఇవే కాకుండా గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలకు పెద్దపీట వేస్తున్నారు. జీహెచ్‌ఎంసీతోపాటు నగర, పట్టణ ప్రాంతాల్లో 4,89,000 దరఖాస్తులు వచ్చాయని, గ్రామీణ ప్రాంతాల నుంచి 3,23,862 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. ఇక ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తు పత్రాలను ట్రంకు పెట్టెల్లో భద్రపరుస్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు ఒక ట్రంకు పెట్టెకు రూ.1,800 చొప్పున కొనుగోలుచేసి దరఖాస్తులన్నీ వాటిలో భద్రపరుస్తున్నారు.
Read Also : Pawan Letter : పవన్ లేఖ ఫై కొట్టు సత్యనారాయణ ఆగ్రహం..ఆధారాలు చూపిస్తావా..?