YS Sharmila Arrested: బ్రేకింగ్.. ఢిల్లీలో షర్మిల అరెస్ట్

‘చలో పార్లమెంట్’ కార్యక్రమాన్నికి పిలుపునిచ్చిన షర్మిల ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Written By:
  • Updated On - March 14, 2023 / 01:32 PM IST

తెలంగాణ వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఢిల్లీ వేదికగా ‘చలో పార్లమెంట్’ కార్యక్రమాన్ని తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు పార్టీ శ్రేణులతో చేరుకున్నారు. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరపాలంటూ ధర్నా చేశారు. తర్వాత జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి నినాదాలు చేసుకుంటూ మందుకు సాగారు.  అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఢిల్లీ పోలీసులు షర్మిల (YS Sharmila) ను అరెస్టు (Arrest) చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందంటూ షర్మిల ఎప్పటినుంచో పోరాటం చేస్తోన్నారు. పాదయాత్రతో పాటు మీడియా సమావేశాల్లో ఇదే అంశాన్ని హైలెట్ చేస్తన్నారు. అంతేాకాకుండా కేసీఆర్ ప్రభుత్వంలోని అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గతంలో కేంద్ర పెద్దలను కలిసి ఫిర్యాదు చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతిపై విచారణ చేపట్టాలని ఢిల్లీ వెళ్లి (YS Sharmila) సీబీఐకి కూడా పలుమార్లు ఫిర్యాదులు చేశారు.