Site icon HashtagU Telugu

Ys Sharmila Convoy: షర్మిల బస్సును తగలబెట్టిన టీఆర్ఎస్ నాయకులు

Sharmila

Sharmila

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలను తప్పిదాలను ఎత్తిచూపుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులను తీవ్రంగా ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని నర్సంపేట్ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర చేస్తుండగా.. చెన్నారావుపేట మండలం లింగగిరిలో లంచ్ బ్రేక్ లో షర్మిల బస్సును టీఆర్ఎస్ నాయకులు తగలబెట్టారు.

షర్మిల పాదయాత్ర వాహనాలపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పలు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు షర్మిల కాన్వాయ్ లోని బస్సుకు నిప్పు పెట్టారని ఆరోపిస్తున్నారు. తమపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని షర్మిలతో పాటు పార్టీ నాయకులు మండిపడుతున్నారు. సంఘటన స్థలంలో వైఎస్సార్ టీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు.