Site icon HashtagU Telugu

TSPSC Group 1: బ్రేకింగ్.. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ రద్దు.. ఏఈఈ, డీఏవో పరీక్షలు కూడా!

తెలంగాణలో (Telangana) టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహరం చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను (Group-1 prelims) రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దానితో పాటు ఏఈఈ, డీఏవో పరీక్షలు కూడా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ లెక్చరర్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

ఇప్పటికే టౌన్ ప్లానింగ్, మెటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్షలు వాయిదా వేసింది. గత ఏడాది అక్టోబర్ 16న ప్రిలిమ్స్‌ను నిర్వహించారు. జూన్ 11న మళ్లీ గ్రూప్-1 ప్రిలిమినరీ (Group-1 prelims) పరీక్ష నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఏఈఈ, డీఏవో పరీక్షలపై త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. అయితే పరీక్షలను రద్దు చేయడంలో అటు నిరుద్యోగులు, అటు వివిధ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దు చేయాల్సింది పరీక్షలను కాదు అని ప్రభుత్వాన్ని అని డిమాండ్ చేస్తున్నారు.

ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఎ1 నిందితుడు ప్రవీణ్‌కు గ్రూప్-1 ప్రిలిమ్స్‌ (Group-1 prelims) లో 103 మార్కులు రావడం తెలిసిందే. తనదగ్గరున్న పెన్‌డ్రైవ్‌లో ఈనెల 5వ తేదీన జరిగిన ఏఈ పరీక్షతో పాటు, 12వ తేదీన జరగాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పరీక్ష పేపర్లు.. అంతేకాకుండా భవిష్యత్తులో జరగబోయే అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగ నియామక పేపర్లను పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read: Puneeth Rajkumar: అప్పు వి మిస్ యూ.. ఘనంగా పునీత్ రాజ్ కుమార్ జయంతి

Exit mobile version