Site icon HashtagU Telugu

Prajavani : ‘ప్రజావాణి’ కి బ్రేక్..ఎందుకంటే..!!

Huge Response To Prajavani

Huge Response To Prajavani

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం ప్రజావాణి (Prajavani)కి తాత్కాలికంగా బ్రేక్ (Break) పడింది. ఎన్నికల కోడ్ (Election Code) కారణంగా ప్రజావాణిని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..వచ్చి రాగానే ప్రజల సమస్య లపై దృష్టి సారించింది. నేరుగా ప్రజలు వచ్చి తమ సమస్యలు తెలిపేందుకు గాను హైదరాబాద్ లో ప్రగతిభవన్ లో ‘ప్రజావాణి’ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఒక్కో రోజు ఒక్కో శాఖకు చెందిన మంత్రులు ప్రజావాణిలో పాల్గొంటూ వస్తునాన్రు. ప్రజల నుంచి వినతులను స్వీకరించి.. వాటిని పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కొనసాగుతుంది. ఒక్కో ప్రజావాణిలో వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా ధరణి పోర్టల్, పింఛన్లు, డబుల్ బెడ్ రూం.. వంటి అంశాలు ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. అయితే ప్రజావాణి కార్యక్రమాన్ని కొన్ని రోజులపాటు నిలిపివేశారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.

మే 13న రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటించనున్నారు. ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూన్ 6న ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగుస్తుంది. దాంతో జూన్ 7 నుంచి తిరిగి ప్రజావాణి కార్యక్రమం యథాతథంగా కొనసాగించనున్నట్లు నోడల్ అధికారి వెల్లడించారు.

Read Also : Praja Galam : ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారు – సజ్జల