Site icon HashtagU Telugu

KTR Break : రాజకీయాలకు బ్రేక్.. కేటీఆర్ సంచలన ట్వీట్

Ktr Break To Politics Sensational Tweet Brs

KTR Break : బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన ట్వీట్ చేశారు. కొన్నిరోజుల పాటు రాజకీయాలకు బ్రేక్‌ ఇచ్చి, రెస్ట్ మోడ్‌లోకి వెళ్తానని ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.  ‘‘నేను రీఫ్రెష్ కావాలని అనుకుంటున్నాను. అందుకే కొన్ని రోజులు అన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను మర్చిపోరని ఆశిస్తున్నాను’’ అని కేటీఆర్(KTR Break) ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ భారీ లైక్స్, వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్స్ నానా రకాల కామెంట్లు పెట్టారు. అంతకుముందు శుక్రవారం రోజు తెలంగాణ భవన్‌‌లో మాట్లాడుతూ కేటీఆర్‌ కీలక కామెంట్స్ చేశారు. సోనియా గాంధీ భిక్ష వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని, తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాల్ని సీఎం రేవంత్ రెడ్డి కించపరుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read :Family Benefit Card : త్వరలో ‘ఫ్యామిలీ బెనిఫిట్‌ కార్డులు’.. ఏఐతో ఇలా పనిచేస్తాయి

హైదరాబాద్​లోని తెలంగాణ భవన్, కరీంనగర్ జిల్లా అలగనూరులో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమాల్లో కేటీఆర్ శుక్రవారం మాట్లాడుతూ.. ‘‘కష్టమొస్తే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భవన్ గుర్తుకొస్తున్నది. తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనతా గ్యారేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది’’ అని కామెంట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలోని అద్భుత ఘట్టాల్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఒక పతాక సన్నివేశమని చెప్పారు. ‘‘1969 తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ వాదాన్ని బుద్ధి జీవులు, మేధావులే కాపాడారు. తర్వాత ఎవరైనా రాకపోతారా.. అని ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ లాంటి వారు ఎదురు చూస్తున్న రోజుల్లో..  కేసీఆర్ వచ్చారు. కేసీఆర్ అంటే పేరు కాదు.. తెలంగాణ పోరు’’ అని కేటీఆర్ అభివర్ణించారు.  ‘‘తెలంగాణ చరిత్రలో కేసీఆర్ హిమాలయాల అంతటి ఎత్తులో ఉన్నారు. ఆయన కాలి గోటికి కూడా రేవంత్ సరిపోరు’’ అని ఆయన ఎద్దేవా చేశారు.