తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) పార్టీ..అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు కీలక హామీలను ప్రారంభించి ప్రజల్లో సంతోషం నింపింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus Service ) ప్రయాణ సౌకర్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ పథకానికి మహిళలు బ్రహ్మ రథంపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ గా ప్రయాణించే సౌకర్యం కల్పించడం తో సీఎం రేవంత్ ఫై మహిళ లోకం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్డినరీ , ఎక్స్ ప్రెస్ లలో రాష్ట్రం మొత్తం చుట్టేసి ఛాన్స్ రావడం తో మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు. మొన్నటి వరకు బస్సు ఛార్జ్ లకు భయపడి ఇంటికే పరిమితమైన మహిళలు..ఇప్పుడు చిన్న ఫంక్షన్ అయినా సరే హాజరు అవుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మహిళలు ఫ్రీ అవకాశం ఇవ్వడం తో మగవారు కూడా మాకు కూడా ఈ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక కొంతమందైతే ఆడవారి గెటప్ వేసుకొని ప్రయాణం చేస్తున్నారు. తాజాగా ఓ చోట ఇలాగే జరిగి..ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అమ్మాయిలాగానే డ్రెస్ వేసుకొని , పేస్ కనపడకుండా చున్నీ కట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు. కాసేపటికి కండక్టర్ కు అనుమానం రావడం తో పేస్ చూపించాలని పట్టుబట్టింది. దీంతో అతడు చేదేంలేక పేస్ ఫై ఉన్న చున్నీ ను తీయడం తో అతని చూసి కండక్టర్ షాక్ అయ్యాడు. నీకేం పోయేకాలం ఇలా వేసుకున్నావ్ అంటే..టికెట్ కు డబ్బులు లేకపోవడం తో ఇలా చేశా అంటూ చెప్పుకొచ్చాడు. ఉదయం నుండి ఇలాగే బసు లో ప్రయాణం చేస్తున్నట్లు తెలిపి షాక్ ఇచ్చాడు. ఇలాంటి వారు ప్రతి రోజు ఎంతమంది బసు లో ప్రయాణం చేస్తున్నారో అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
Read Also : TSPSC Paper Leak : TSPSC చైర్మన్ రాజీనామాలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్