Site icon HashtagU Telugu

Bandi Sanjay: ప్రజల ప్రాణాలు తీసేందుకే మీ సమ్మేళనాలు, ఉత్సవాలు, వేడుకలా?

Bandi Sanjay

New Web Story Copy 2023 06 20t193331.884

Bandi Sanjay: తెలంగాణలో వీధి కుక్కులు స్వైర విహారం చేస్తున్నాయి. గత కొద్దీ రోజులుగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వీధి కుక్కల దాడిలో ఇప్పటికే ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో బాలుడు వీధి కుక్కల దాడిలో చనిపోయాడు. వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి ట్రాక్టర్‌ కింద పడి 6వ తరగతి బాలుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పదేళ్ల ఇనుగాల ధనుష్ తన తోటి విద్యార్థులతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా రోడ్డు పక్కన ఉన్న కుక్క ఒక్కసారిగా బాలుడిపై దాడి చేసింది. దీంతో కుక్క నుంచి తప్పించుకునే క్రమంలో ఆ బాలుడు సమీపంలోని రహదారిపై ప్రయాణిస్తున్న ట్రాక్టర్ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

తెలంగాణ దశాబ్ది వేడుకల్లో చోటు చేసుకున్న విషాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించాడు. బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ఇలా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో కమలాపూర్ మండలం మర్పెల్లిగూడెంలో 6వ తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్ దుర్మరణం దిగ్భ్రాంతికరం. బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. స్కూల్ లో చదువుకుంటున్న విద్యార్ధిని దశాబ్ది ఉత్సవాలకు తీసుకొచ్చిన ప్రభుత్వమే ఈ మృతికి బాధ్యత వహించాలి. తక్షణమే బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని బండి డిమాండ్ చేశారు.

ప్రజల ఉసురు పోసుకునేందుకే బీఆర్ఎస్ సర్కార్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందా? ఈ ఉత్సవాల్లో పాల్గొనేలా ప్రభుత్వ యంత్రాగంపై ఒత్తిడి తెస్తున్న ఈ సర్కార్ విద్యార్థులను సైతం బలవంత పెట్టడం దారుణం. ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్న చిన్నారి విగతజీవిగా మారడానికి కారణమెవరు? ఆ తల్లితండ్రుల బాధను ఎవరు తీరుస్తారు? ఏం చెప్పి వారిని ఓదారుస్తారు అంటూ బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

గతంలో ఖమ్మం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని కొందరు మృతి చెందారు.. వనపర్తి జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కళ్యాణలక్ష్మీ చెక్కు తీసుకునేందుకు వచ్చిన మరో వృద్ధురాలిని రోజంతా వెయిట్ చేయించి ఆమె మృతికి కారణమయ్యారు.. ఇప్పుడు దశాబ్ధి ఉత్సవాల్లో 6వ తరగతి చిన్నారి దుర్మరణం పాలయ్యాడు. ప్రజల ప్రాణాలు తీసేందుకే మీ సమ్మేళనాలు, ఉత్సవాలు, వేడుకలా..అంటూ అధికార పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Read More: YSR Family Twist : కాంగ్రెస్ లోకి ష‌ర్మిల ? జ‌గ‌న్ ఛాప్ట‌ర్ క్లోజ్ !