Site icon HashtagU Telugu

Munugode : మునుగోడు బీజేపీ ప్ర‌చారంలోకి మాజీ ఎంపీ బూర‌

Bura Imresizer

Bura Imresizer

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నేత‌ల‌పై బీజేపీ ఆప‌రేష‌న్ వేగంగా జ‌రుగుతోంది. ఆ క్ర‌మంలో మాజీ ఎంపీ బూర న‌ర‌స‌య్య గౌడ్ బీజేపీ పంచ‌న చేరారు. ఈనెల 20వ తేదీ నుంచి మునుగోడు ప్ర‌చారంలోకి దిగ‌నున్నారు. అంతేకాదు, ఈనెల 28 బీసీ ఆత్మీయ స‌మ్మేళ‌నం జ‌ర‌గ‌బోతుంది.

ఉద్య‌కారునిగా, డాక్ట‌ర్ గా మునుగోడు ప్ర‌జ‌ల‌కు బూర న‌ర‌స‌య్య గౌడ్ సుప‌రిచ‌యం. ఎంపీగా 2014 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2019 ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ రెండోసారి టిక్కెట్ ఇచ్చిన‌ప్ప‌టికీ ఓడిపోయారు. అప్ప‌టి నుంచి సంస్థాగ‌తంగా టీఆర్ఎస్ పార్టీ బూర‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డంలేదు. మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో టిక్కెట్ బూర ఆశించారు. కానీ, 2018 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్ర‌భాక‌ర్ రెడ్డిని రంగంలోకి దింపింది. దీంతో బీసీలు గులాబీ పార్టీ మీద గుర్రుగా ఉన్నారు. అంతేకాదు, న‌ర‌స‌య్య గౌడ్ మీద బీసీలు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయ‌న బీజేపీ వైపు మళ్లారు. ఇటీవ‌ల జాతీయ అధ్యక్షుడు న‌డ్డా వ‌ద్ద‌కు ఆయ‌న్ను బండి సంజ‌య్ తీసుకెళ్లారు. తాజాగా సోమ‌వారం బీజేపీ తెలంగాణ లీడ‌ర్లు బూర‌ను సాద‌రంగా ఆహ్వానించారు.

ఈనెల 19వ తేదీన బీజేపీ అధికారికంగా బూర న‌ర‌స‌య్య గౌడ్ చేర‌బోతున్నారు. ఆ మ‌రుస‌టి రోజు ఉంచి క్షేత్ర‌స్థాయిలో మునుగోడు ప్ర‌చార రంగంలోకి దిగ‌బోతున్నారు. బీసీ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు బీజేపీ గౌడ్ ను ప్ర‌యోగించ‌బోతుంది. అంతేకాదు, గౌడ్ తో ప‌నిచేసిన ద్వితీయ శ్రేణి లీడ‌ర్ల‌ను టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి ఆక‌ర్షించ‌డానికి రంగం సిద్ధం అయింది. మొత్తం మీద బూర మ‌ద్ధ‌తు రాజ‌గోపాల్ రెడ్డికి ఎంతో కొంత సానుకూల ఫ‌లితాల‌ను ఇచ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌తిగా బూర‌కు ఎలాంటి ప్రాధాన్యం బీజేపీ ఇవ్వ‌నుందో చూడాలి.