Site icon HashtagU Telugu

Bonthu Rammohan : కాంగ్రెస్‌లోకి బొంతు రామ్మోహన్..?

Bonthu

Bonthu

బిఆర్ఎస్ పార్టీ కి వరుస షాకులు తగ్గడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైతే పెద్ద ఎత్తున నేతలు బిఆర్ఎస్ (BRS) కు రాజీనామా చేసి , కాంగ్రెస్ లో చేరారో..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అలాగే చేరుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు , మంత్రులు , ఎమ్మెల్సీ లు , కార్పొరేటర్లు చేరగా..ఇప్పుడు మరికొంతమంది అదే బాటలో చేరబోతున్నారు. రీసెంట్ గా మాజీ మంత్రి పట్నం మహేందర్..సీఎం రేవంత్ (CM Revanth) ను కలిసి..కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధం అని సంకేతాలు తెలియజేయగా..ఇప్పుడు బీఆర్ఎస్ నేత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం ను కలవబోతున్నట్లు తెలుస్తుంది. తన అనుచరులు, నియోజకవర్గ నేతలతో కలిసి ‘కారు’ దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మరికాసేపట్లో (ఆదివారం) రామ్మోహన్ (Bonthu Rammohan) సమావేశం కానున్నారు. ఇటీవల రేవంత్‌ని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీలపై గులాబీ బాస్ కేసీఆర్ సీరియస్ వారిపై సీరియస్ అయ్యారు. సీఎం ఇంటికెళ్లి కలవడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్ వార్నింగ్ తర్వాత కూడా రేవంత్‌ని బొంతు రామ్మోహన్ కలవడంపై బిఆర్ఎస్ శ్రేణుల్లో హాట్ హాట్ గా మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బొంతు రామ్మోహన్.. జీహెచ్ఎంసీ మేయర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డ బొంతు రామ్మోహన్ నాటి నుంచి పార్టీతో అంటీ ముట్టన్నట్లుగానే ఉంటూ వస్తున్నారు. అప్పట్లోనే పార్టీ మారుతారని ప్రచారం జరిగినప్పటికీ జంప్ చేసినా కానీ ఉప్పల్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేయడానికి బొంతు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్‌లో కూడా ఈ నియోజకవర్గానికి గట్టిపోటీనే ఉంది. అయితే.. బీఆర్ఎస్‌లో మల్కాజ్‌గిరి టికెట్ కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి .. తన కుమారుడ్ని పోటీ చేయించాలని ప్లాన్‌లో ఉన్నారు. దీంతో టికెట్ అడిగినా ఇచ్చే పరిస్థితి లేదని.. అటు ఎమ్మెల్యే .. ఇటు ఎంపీ టికెట్ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రామ్మోహన్ ఇక పార్టీలో ఉండి ఫలితం లేదని కాంగ్రెస్‌లో చేరాలని అనుచరులతో చర్చించి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు.

Read Also : Medaram Jatara : మేడారంలో ధరల మోత..గగ్గోలు పెడుతున్న భక్తులు