Bomb Blast : ములుగు జిల్లాలో మావోయిస్టులు పెట్టిన బాంబు పేలి ఒకరు మృతి

పోలీసులను టార్గెట్ చేస్తూ కొంగాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబు పెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన సోమ‌వారం జరిగింది

Published By: HashtagU Telugu Desk
Bomb Blast Mulugu

Bomb Blast Mulugu

ములుగు జిల్లా వాజేడు మండలంలో దారుణం జ‌రిగింది. పోలీసులను టార్గెట్ చేస్తూ కొంగాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబు పెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన సోమ‌వారం జరిగింది. జగన్నాపురం గ్రామానికి చెందిన ఇల్లందుల ఏసు (55 ), ఇల్లందుల రమేష్, ఇల్లందుల ఫకీర్, ఇల్లెందుల పాల్గుణ, అరికిల్ల లక్ష్మయ్య క‌ట్టెల కోసం కొంగాల అటవీ ప్రాంతానికి ఉదయం వెళ్లారు. గుట్ట పైకి వెళ్తున్న సమయంలో దారిలో అమర్చిన బాంబు పేలింది. దీంతో ఇల్లెందుల ఏసు అక్కడికక్కడే చ‌నిపోయాడు.

We’re now on WhatsApp. Click to Join.

మిగతా నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వారికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రెజర్ బాంబు పేలడంతో శబ్దానికి దూరంగా పరిగెత్తారు. కొంగాల గుట్టపై బాంబు పేలడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇది తెలుసుకున్న బంధువులు, స్థానికులు సంఘటనా ప్రాంతానికి వెళ్లి విలిపిస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో అనేకమంది మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దీంతో మావోయిస్టులు కూడా దాడులకు యత్నించినట్టు తెలుస్తోంది.

Read Also : Kerala Rains : కేరళను వణికిస్తున్న భారీ వర్షాలు

  Last Updated: 03 Jun 2024, 10:56 AM IST