Bomb Explode of illegal Constructions in Sangareddy : ప్రభుత్వ భూములు , చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికీ నిద్ర లేకుండా చేస్తుంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ లో ఇప్పటికే హైడ్రా ను రంగంలోకి దింపి అక్రమ నిర్మాణాలను కూలుస్తుండగా..జిల్లా కేంద్రాల్లో కూడా అక్రమ నిర్మాణాల ఫై ఫోకస్ చేసారు. ప్రభుత్వ స్థలాలు కానీ చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసారు. దీంతో అక్కడిక్కడే కబ్జా చేసిన వాటిపై నిఘా పెట్టారు అధికారులు. ఈ క్రమంలో సంగారెడ్డి (Sangareddy ) జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్‌షాయిపేట మల్కాపూర్ పెట్ట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఓ వ్యక్తి ఏకంగా నాల్గు అంతస్తుల భవనం నిర్మించాడు. గత కొంతకాలంగా దీనిని పెద్దగా ఎవ్వరు పట్టించుకోలేదు.
ఇప్పుడు ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టడం తో..ఈ భవనం విషయాన్నీ కలెక్టర్ వల్లూరి క్రాంతి దృష్టి కి చేర్చారు. దీంతో విచారణకు ఆదేశించడంతో కొండాపూర్ మండల రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించి నిర్మాణం ఎఫ్‌టీఎల్‌లోనే ఉందని గుర్తించి కలెక్టర్‌కు తెలిపారు. ఆమె ఆదేశాల మేరకు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య బహుళ అంతస్తుల భవనాన్ని బాంబులతో తహసీల్దార్ అనిత, ఇతర అధికారులు నేలమట్టం చేయించారు. కాగా, భారీ నిర్మాణం కావడంతో కూలుతున్న సమయంలో వచ్చిన రాయి తగిలి అక్కడే ఉన్న హోంగార్డు గోపాల్ తలకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న అధికారులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుప్రతికి తరలించారు.
Read Also : PM Modi : ప్రధాని మోడీ పూణే పర్యటన రద్దు..