బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Bodhan Ex MLA Shakeel) ఫై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు (Lookout Notice) జారీ చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బారికేడ్ను ఢీకొన్న కేసులో కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించినట్లు గుర్తించిన పోలీసులు.. రాహిల్, షకీల్ ఇద్దరు దుబాయ్ లో ఉన్నట్లు సమాచారం ఉందని అన్నారు. ప్రధాన నిందితుడు రాహిల్ తో పాటు.. మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని క్లారిటీ ఇచ్చారు.
పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్, బోధన్ మాజీ ఇన్స్పెక్టర్ లను అరెస్ట్ చేసి జడ్జ్ ముందు ప్రొడ్యూస్ చేశామన్నారు. వారిద్దరికి పర్సనల్ బాండ్ పైన కోర్టు బెయిల్ ఇచ్చిందని తెలిపారు. ఈ కేసులో మొత్తం 16 మంది పై కేసు నమోదు చేశామన్నారు. నిందితులకు పోలీసులు సహకరించినట్లు గుర్తించామని అన్నారు. ఈ కేసులో నిందితులకు సహకరించిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అసలు ఏంజరిగిందంటే..
డిసెంబర్ 23న హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ముందు ఉన్న బారికేడ్లను.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహెల్.. కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన నిందితుడైన సాహెల్‌ను తప్పించి.. అతని డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే.. సాహెల్‌ను తప్పించటంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది సహకరించినట్టు ఆరోపణలు రావటంతో.. ఉన్నతాధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అప్పటికే.. సాహెల్ దుబాయ్ పారిపోగా.. అతనిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సీఐ దుర్గారావు డ్యూటీలో ఉన్నట్టు.. అతనే నిందితున్ని తప్పించటంతో కీలకంగా వ్యవహరించినట్టు దర్యాప్తులో తేలటంతో.. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న దుర్గారావును వెతుకుతున్న క్రమంలో.. అనంతపురం గుంతకల్ రైల్వే స్టేషన్‌లో పట్టుబడ్డాడు. సోమవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు దుర్గారావును హైదరాబాద్ తీసుకొచ్చారు. వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో దుర్గారావును పోలీసులు విచారిస్తున్నారు.
Read Also : APCC Chief Sharmila : షర్మిలను కాస్త చూసుకోండి..కేంద్రానికి వైసీపీ సలహా..?