Site icon HashtagU Telugu

BJP Strategy : హీరోలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడి భేటీపై సర్వత్రా ఆసక్తి..!!!

Jp Nadda

Jp Nadda

తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవలనే లక్ష్యంతో బీజేపీ తన వ్యూహాలు అమలు చేస్తోంది. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ సీనియర్ నేత అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కాగా.. నేడు  హీరో నితిన్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. వరుసగా టాలీవుడ్ హీరోలతో భేటీ ద్వారా బీజేపీ ఎలాంటి స్ట్రాటజీని అమలు చేస్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

శనివారం జేపీ నడ్డాను కలవనున్న నితిన్,మిథాలి రాజ్ లు

నేడు హన్మకొండ లో బీజేపీ సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ రానున్నారు. పర్యటనలో భాగంగా టాలీవుడ్ హీరో నితిన్ తో భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం నోవాటేల్ హోటల్ లో నడ్డా,నితిన్ భేటీ జరగనుంది. అలాగే మహిళ క్రికెటర్ మిథాలి రాజ్ తోనూ నడ్డా సమావేశం కానున్నారు.