Site icon HashtagU Telugu

BJP Operation: బీజేపీ సీక్రెట్ ఆపరేషన్.. కమలంలోకి 22 మంది కీలక నేతలు

What Happened in Telangana BJP disputes in Party Leaders

What Happened in Telangana BJP disputes in Party Leaders

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కొంతమంది బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలను లాక్కునేందుకు బీజేపీ రహస్యంగా ప్రయత్నిస్తోందని అంతర్గత వర్గాలు సూచిస్తున్నాయి. ఈ పార్టీల నుంచి 22 మంది నేతలు బీజేపీలోకి మారే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆగస్టు 27న అమిత్ షా సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరే అవకాశం ఉంది. భాజపా సీనియర్‌ సభ్యులు, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌, ఎమ్మెల్సీ రఘునందన్‌రావులు ఖమ్మం సభలో జరుగుతున్న ఈ పరిణామంపై పరోక్షంగా చెప్పినా, మరిన్ని వివరాలను గోప్యంగా ఉంచారు.

గ‌తంలో బీజేపీ తెలంగాణ చీఫ్ గా ఉన్న‌ బండి సంజ‌య్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో ట‌చ్ లో ఉన్నార‌ని ప్ర‌చారం చేశారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ, హుజూరాబాద్‌, మ‌నుగోలు ఉప ఎన్నిక‌ల్లోనూ ఆ ప్ర‌చారం కొంత మేర‌కు ఫ‌లించింది. ఆ త‌రువాత ఆయ‌న మాట‌లు ఉత్తదేన‌ని తేలింది. అంతేకాదు, ఎమ్మెల్సీ క‌వితను అరెస్ట్ చేస్తున్నారంటూ ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టిన బీజేపీ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చేసింది. దీంతో బీజేపీ మాట‌ల‌ను న‌మ్మే ప‌రిస్థితి ప్ర‌స్తుతం లేదు. అందుకే, బీజేపీ వైపు చూసే లీడ‌ర్లు లేర‌ని (Eelection Meetings)  స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ తెలంగాణ‌కు అమిత్ షా వ‌స్తున్నారు. ఇప్ప‌టికే మూడుసార్లు వాయిగా వేసుకున్న స‌భ‌ను ఎట్ట‌కేల‌కు నిర్వ‌హించాల‌ని ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అమిత్ షా సభ ఏర్పాటును పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మట్లాడారు. 12 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు బీఆర్​ఎస్​ పార్టీలో చేరిన విషయాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ‘‘ఈరోజు రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన, పెత్తనం, ఆధిపత్యం ఉంది. ఒక కుటుంబ అహంకారం రాష్ట్రాన్ని పాలిస్తుంది. దీన్ని ఖమ్మం ప్రజలు అర్థం చేసుకోవాలి. కేసీఆర్​ గద్దె దిగడం ఒక్కటే కాదు.. మౌలిక మార్పులు రావాలి. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ రెండూ ఒక్కటే. అనేకసార్లు అవి పొత్తు పెట్టుకున్నాయి. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికలు జరిగితే.. బీఆర్​ఎస్​ పార్టీ కాంగ్రెస్​కు మద్దతు ఇచ్చింది. ఇటీవల బీఆర్​ఎస్​ మంత్రి మాట్లాడుతూ.. మేము కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని అన్నాడు. ఇది పగటికలే అయినప్పటికీ.. కాంగ్రెస్​ నేతృత్వంలో ప్రతిపక్ష కూటమితో వాళ్లు కలుస్తారనేది అర్థం అవుతోంది’’ కిషన్ రెడ్డి అన్నారు.

Also Read: Allu Arjun: మామ కోసం అల్లుడు, అల్లు అర్జున్ ‘పొలిటికల్’ క్యాంపెయిన్