Site icon HashtagU Telugu

BJP’s Name Game in Telangana : మూసాపేట ఇక మస్కిపేట గా మారబోతుందా..?

Moosapet To Muskipet

Moosapet To Muskipet

అధికారంలోకి ఏ పార్టీ వచ్చిన వారికీ అనుగుణంగా పేర్లు మార్చడం చేస్తుంటారు. మొన్నటివరకు బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అధికారంలో ఉన్న క్రమంలో వాహనాల రిజిస్టేషన్లకు AP ని కాస్త TS గా చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే TS ను కాస్త TG మార్చారు. అంతే కాదు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిని కూడా యాదగిరి గుట్టగా మార్చబోతున్నారు. ఇలా ఈ రెండే కాదు నగరంలోని పలు ఏరియాల పేర్లు కూడా మార్చాలని చూస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూసాపేట ప్రాంతం పేరును మస్కిపేట (Moosapet to Muskipet) గా పేర్కొంటూ ఓ బోర్డు దర్శనం ఇవ్వడం ఆసక్తిగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇందుకు సంబధించిన ఫోటోను ఓ నెటిజన్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా దీనిపై హాట్ టాపిక్ గా మారింది. తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ సహా పలు నగరాల పేర్లు మారుస్తామని చాలా కాలంగా బీజేపీ చెబుతూ వస్తోంది. హైదరాబాద్ స్థానంలో భాగ్యనగరం, నిజామాబాద్ పేరును ఇందూరు, ఆదిలాబాద్ ను ఎదులాపురం, మహబూబ్ నగర్ ను పాలమూరు, వరంగల్ ను ఓరుగల్లు, కరీంగనర్ ను కరిపురంగా మార్చాలని కమల దళం డిమాండ్ చేస్తోంది. ఇన్నాళ్లు ఈ డిమాండ్ బీజేపీ నేతల ప్రసంగాలు, ప్రకటనల వరకే పరిమితం కాగా ఇప్పుడు తమ డిమాండ్లను బస్తీ స్థాయిలోకి విస్తరించడం వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజంగా పేర్లు మారుస్తారా..? మారిస్తే ప్రజలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారు..? పేర్లు మార్చడం ఎంత వరకు ఉపయోగం అనేది నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

Read Also ; Raebareli: ఈసారి రాయబరేలి నుంచి ఎవరు పోటీ ?