Telangana: గేట్లు తెరిచావు సరే.. ఆ గేటు నుండి ఎమ్మెల్యేలు పోకుండా చూసుకో

గేట్లు తెరిచామని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అయితే ఆ గేట్ల నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని కాంగ్రెస్ ను హెచ్చరించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కే లక్ష్మణ్‌.

Published By: HashtagU Telugu Desk
Telangana

Telangana

Telangana: గేట్లు తెరిచామని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అయితే ఆ గేట్ల నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని కాంగ్రెస్ ను హెచ్చరించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కే లక్ష్మణ్‌.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు కచ్చితంగా మార్గం సుగమం అవుతుందని, అయితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చబోదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కే లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే బీజేపీ కాపాడదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఇటీవల అన్నారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. గేట్లు తెరిచామని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అయితే ఆ గేట్ల నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని కాంగ్రెస్ ను హెచ్చరించారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తుందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అవసరమా అని ప్రశ్నించారు. రానున్న కాలంలో కాంగ్రెస్ దేశం మొత్తం ఓడిపోవడం ఖాయం. రాహుల్ గాంధీ రాజకీయంగా విఫలమైన నాయకుడు. ప్రతిపక్షంలో ప్రధాని మోదీకి సాటి లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని ఆయన అన్నారు. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా బీజేపీతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబ పాలన, వారసత్వ పాలన, కుల పాలన, అవినీతి పాలనను పారద్రోలాలని ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని అన్నారు.

Also Rread: Pithapuram Politics : లోకల్ vs నాన్ లోకల్ Vs ప్రిఫరెన్షియల్ ట్రీట్‌మెంట్..!

  Last Updated: 18 Mar 2024, 07:14 PM IST