Telangana : వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 10 సీట్లు కూడా రావు – టీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఠాగూర్‌

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 10 సీట్లు కూడా రావని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అన్నారు

Published By: HashtagU Telugu Desk
Telangana Congress

Telangana Congress

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 10 సీట్లు కూడా రావని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ అసమ్మతి నేతలను ఏకం చేసేందుకు అధిష్టానం చేసిన ప్ర‌య‌త్నం విజ‌య‌వంత‌మైంద‌న్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కోమెట్ రెడ్డి వెంకట్ రెడ్డిని ఎన్నికల ప్రచారానికి తీసుకురావడంలో ప్రియాంక గాంధీ విజయం సాధించారని తెలిపారు. ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఉద్యమిస్తామన్నారు. మునుగోడు కాంగ్రెస్ కంచుకోట అన్నారు. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా మాణికం ఠాగూర్ రెండేళ్లు పూర్తి చేసుకోనున్నారు. లోపభూయిష్ట విధానాల వల్లే 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. రాష్ట్రంలో 42 వేల మంది పోలింగ్‌ బూత్‌ స్థాయి కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారని, 41 లక్షల సభ్యత్వాల లక్ష్యం సాధించామన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై ప్రియాంక గాంధీ దృష్టి సారించారని ఠాగూర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ క్రికెట్ టీమ్ లాంటిదని, వచ్చే ఎన్నికల్లో టీమ్ స్పిరిట్‌తో పోరాడుతామని ఠాగూర్ అన్నారు.

  Last Updated: 28 Aug 2022, 10:48 AM IST