Site icon HashtagU Telugu

BJP – Main Opposition : అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను బీఆర్ఎస్‌ నిలుపుకునేనా ?

Bjp In Telangana Assembly

BJP – Main Opposition : తెలంగాణ రాజకీయాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలలోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కడుతున్నారు. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరాలని భావిస్తున్నారని తాజాగా బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సీఎం రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎడతెరిపి లేని రేంజులో ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తోంది. ఎంతోమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంతనాలు జరుపుతోంది. ఆగస్టు నెలలో తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సమయానికి సాధ్యమైనంత ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలనే పట్టుదలతో సీఎం రేవంత్ ఉన్నారు. ఇంకోవైపు బీజేపీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు ఆకర్షించేందుకు ప్లాన్ చేస్తోంది. వెరసి బీఆర్ఎస్ బలహీనంగా మారే అవకాశాలు ముమ్మరంగా కనిపిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు సక్సెస్ అయితే తెలంగాణ అసెంబ్లీలో కనీసం ప్రధాన ప్రతిపక్షం హోదాను కూడా బీఆర్ఎస్ కోల్పోయే ముప్పు ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చాయి. బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. త్వరలోనే బీఆర్ఎస్ నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు బీఆర్ఎస్ఎల్పీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ వారంలో మరికొందరు ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరే అవకాశం ఉంది.కడియం శ్రీహరి వలసతో బీఆర్ఎస్‌లో మొదలైన లుకలుకలు కంటిన్యూ అయ్యాయి. తెల్లం వెంకట్రావు (భద్రాచలం), దానం నాగేందర్ (ఖైరతాబాద్), పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ), కాలె యాదయ్య (చేవెళ్ళ), తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌కు జైకొట్టాయి. ఇవాళో రేపో ఆలంపూర్ ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.

Also Read :Lord Shiva : ‘3’ సంఖ్యతో పరమశివుడికి ప్రత్యేక అనుబంధం!

అధికారంలో ఉన్న పదేళ్ల టైంలో టీడీపీ, కాంగ్రెస్ శాసనసభాపక్షాలను బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకుంది. ఇప్పుడు అదే పనిని సీఎం రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. ఈనెలాఖరు కల్లా పెద్దసంఖ్యలో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరినా ఆశ్చర్యం లేదనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలుపుకొని తెలంగాణ అసెంబ్లీలో అతిపెద్ద విపక్ష పార్టీగా(BJP – Main Opposition) అవతరించేందుకు బీజేపీ(BJP) ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. అంచనాలు ఎలా ఉన్నప్పటికీ.. వాస్తవ పరిణామాలు ఎలా చోటుచేసుకుంటాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version