Maha crisis: ఎనిమిది ప్ర‌భుత్వాల‌ను మోడీ కూల్చాడు: KTR

  • Written By:
  • Publish Date - June 27, 2022 / 07:00 PM IST

మోడీ ప్ర‌ధాన మంత్రి అయిన త‌రువాత దేశంలోని ఎనిమిది రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూల్చాడ‌ని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ ,గోవాల్లో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారని గుర్తు చేశారు. త్వరలోనే ఆయన నియంతృత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ గ‌ళం వినిపిస్తుందని వెల్ల‌డించారు.

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తీసుకొచ్చిన బీజేపీ శివసేనలోని రెండు వర్గాలు ఒకటి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో మరొకటి తిరుగుబాటుదారుడు ఏక్నాథ్ షిండే ఏర్పాటు చేసేలా కుట్ర ప‌న్నార‌ని అన్నారు. శివసేన లెజిస్లేచర్ పార్టీకి చెందిన 38 మంది సభ్యులు తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి సభలో మెజారిటీని కోల్పోయిందని, తద్వారా అది సభలో మెజారిటీ కంటే తక్కువగా ఉందని మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం అస్సాంలో మకాం వేసిన శివసేన ఎమ్మెల్యేలలో పెద్ద సంఖ్యలో తిరుగుబాటు కారణంగా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో, తిరుగుబాటు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులకు వ్యతిరేకంగా ఏక్నాథ్ షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి ప‌రిణామాల‌కు కార‌ణ‌మైన మోడీ స‌ర్కార్ ను నిల‌దీయాల‌ని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ, “నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుండి, ఆయన పార్టీ కనీసం ఎనిమిది ప్రభుత్వాలను పడగొట్టి, బలవంతంగా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంద‌ని ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలను ఇబ్బందులకు గురిచేస్తోందని, రాబోయే రోజుల్లో కేంద్రం నిరంకుశ పాలన అంతం పాడేందుకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంద‌ని వెల్ల‌డించారు.