Telangana BJP : సీనియ‌ర్ల‌పై బీజేపీ ఆప‌రేష‌న్‌

ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే సీనియ‌ర్ల‌ను బీజేపీ న‌మ్ముకుంటోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావడానికి అదే స‌రైన మార్గంగా భావిస్తోంది.

  • Written By:
  • Publish Date - July 11, 2022 / 02:59 PM IST

ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే సీనియ‌ర్ల‌ను బీజేపీ న‌మ్ముకుంటోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావడానికి అదే స‌రైన మార్గంగా భావిస్తోంది. ఆ మేర‌కు బీజేపీ తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్ దిశానిర్దేశం చేయ‌డం గ‌మనార్హం. ప్ర‌ధాన పార్టీల సీనియ‌ర్ల‌ను ఆహ్వానించాల‌ని సూచించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించే లక్ష్యంతో ముందుకు సాగాల‌ని ఆదేశించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ద్వారా క్యాడర్‌ను బలోపేతం చేసుకునేందుకు బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసింది.
బీజేపీ తెలంగాణ శాఖ ఇంచార్జి తరుణ్ చుగ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్, ఫైనాన్స్ కమిటీ కన్వీనర్ జితేందర్, ప్రజాసమస్యలు, టీఆర్‌ఎస్ పార్టీ వైఫల్యాల అధ్యయన కమిటీ కన్వీనర్ డి.అరవింద్ సహా సీనియర్ నేతల‌కు ప్ర‌ణాళిక‌ను తెలియ‌చేశారు. కో-ఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌ ఈటల రాజేందర్ తో కొత్తవారి చేరికలపై ఈ సమావేశంలో చర్చించారు

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, సీనియర్లను బిజెపిలో చేరడానికి పార్టీ ప్రోత్సహిస్తుంది. జులై 21న బైక్‌ ర్యాలీలు నిర్వహించడం ద్వారా నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పాలన వైఫల్యాలను ఎత్తిచూపాల‌ని సూచించారు.
జూలై 21న ‘పల్లె గోస- బీజేపీ భరోసా’ పేరుతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణ‌యించారు. రాష్ట్రంలో బండి సంజయ్ కుమార్ మూడో దశ ప్రజాసంగ్రామ యాత్రను చుగ్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించాల‌ని తెలిపార‌.

రాష్ట్రంలోని ధరణి పోర్టల్ లోపాలను, పోడు భూముల సమస్యలను ప్రభుత్వం సరిదిద్దలేకపోవడాన్ని నిరసిస్తూ సంజయ్ కుమార్ కరీంనగర్‌లో మౌన దీక్షకు దిగారు. ఆ త‌రువాత‌ “బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో 30 మంది సీనియర్ నాయకులు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. ప్రజలతో మమేకమయ్యేందుకు రాత్రిపూట గ్రామాలలో బస చేయాల‌ని పేర్కొన్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా, బిజెపి కార్యకర్తలందరూ జాతీయ జెండాను ఎగురవేయాలి. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గాల‌ని దిశానిర్దేశం చేశారు.