Bandi Sanjay : రేవంత్ ఇలాకాపై కాషాయదళం కన్ను…అక్కడి నుంచే 4వ విడతపాదయాత్ర షురూ..!!

తెలంగాణ బీజేపీ దూకుడు మీదుంది. తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

  • Written By:
  • Updated On - August 30, 2022 / 04:14 PM IST

తెలంగాణ బీజేపీ దూకుడు మీదుంది. తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రణాళికను రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మూడు విడతల మహాసంగ్రామ యాత్ర పేరుతో ప్రజల మధ్యే ఉన్న ఆయన ఇప్పుడు నాలుగో విడత పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే నాలుగ విడత ప్రజాసంగ్రామయాత్ర సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభించనున్నట్లు పార్టీ ముఖ్యనాయకుల ద్వారా తెలుస్తోంది.

మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించాలన్న యోచనలో ఆపార్టీ ఉన్నట్లు ముఖ్యసమాచారం. మొదట పార్టీ ఏ నియోజకవర్గాల్లో అయితే బలహీనంగా ఉందో ఆ ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలని కమలనాథులు భావించారు. అందుకే 3 విడతలు దాదాపు గ్రామీణ ప్రాంతాల్లోనే కొనసాగింది. 4వ విడతలో మాత్రం అర్బన్ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

కాగా 4వ విడత పాదయాత్ర మూడు విడతల కంటే భిన్నంగా నిర్వహించునున్నట్లు ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలతోపాటుగా ఏ జిల్లాల్లో అయితే పార్టీ బలహీనంగా ఉందో అక్కడే ఈ మూడు విడతలు కొనసాగింది. ఇప్పుడు ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెట్టాలని భావించిన పార్టీనేతలు…మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నిక అక్టోబరులో ఉండే ఛాన్స్ ఉంది.

ఈనేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో పాదయాత్ర చేపడితే ప్రచారానికి ఇబ్బంది కలిగుతుందని అందుకే మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది రెండు మూడు రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది. రంగారెడ్డి పరిధిలోని నాయకులతోపాటు జీహెచ్ ఎంసీ పరిధిలోని కార్యకర్తలతోసమావేశం నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు.

వ్యూహాత్మకంగా ముగింపు సభ :
కుత్బుల్లాపూర్ నియోజవర్గంలో ప్రారంభించే యాత్రను అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ వద్ద ముగించాలన్న యోచనతో బీజేపీ ఉంది. యాత్ర ముగించే ప్రాంతానికి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం 10 నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉపప్రచారానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ ప్లాన్ చేసినట్లు సమాచారం.

ప్రతి నియోజకవర్గంలో భారీ బహిరంగసభకు ప్లాన్:
మల్కాజ్ గిరి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తే గాజులరామారంలోని చిత్తారమ్మ ఆలయం నుంచి లేదనుకుంటే…సూరారంలోని కట్టమైసమ్మ ఆలయం నుంచి మొదలు పెట్టాలని పార్టీ యోచిస్తోంది.
కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, మేడ్చల్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల నుంచి యాత్ర కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతినియోజకవర్గంలో ఒకరోజు పాటు యాత్ర కొనసాగిస్తూ…ప్రతినియోజకవర్గంలో భారీ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.

రేవంత్ రెడ్డి ఇలాకలో పాగా వేేసేందుకు ప్లాన్:
టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మల్కాజ్ గిరి పార్లమెంట్ లో నాలుగో విడత పాదయాత్ర చేపట్టి…బీజేపీ పాగా వేసేందుకు ప్లాన్ చేస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ కు చెక్ పెట్టాలన్న టార్గెట్ తో ప్రణాళికలు రచిస్తోంది. గోరేటి వెంకన్న గల్లీ సిన్నది…గరీబోళ్ల కథ పెద్దది…పాటను ప్రచారానికి వినియోగించుకుని ప్రత్యర్థులపూ వ్యంగ్యాస్త్రాలు వేసేందుకు కమలం దళం రెడీ అవుతోంది.