Site icon HashtagU Telugu

Bandi Sanjay : ట్యాంక్ బండ్ ముట్టడికి బండి సంజయ్ పిలుపు..సద్ది కట్టుకొని రమ్మని ఆహ్వానం..!!

Telangana BJP

Sanjay bandi

మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. కేటీఆర్ నాస్తికుడు, అందుకే వినాయక నిమజ్జనాలకు ఆటంకాలు కలిగిస్తున్నారన్నారు. బుధవారం బీజేపీ నేతలతో కలిసి ఆయన ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఓ వర్గం కోసమే ప్రభుత్వం కావాలని నిమజ్జనానికి ఆటంకాలు కల్పిస్తుందని విమర్శించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ట్యాంక్ బండ్ పైనే నిమజ్జనాలు నిర్వహిస్తామన్నారు.

హిందువులు ప్రతిఒక్కరూ సద్దికట్టుకుని ట్యాంక్ బండ్ కు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం అసలుసిసలైన హిందువు అయితే…మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భాగ్యనగర ఉత్సవ సమితి దీక్షలకు దిగొచ్చి ట్యాంక్ బండ్ పై ట్యాంక్ బండ్ పై క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు.