జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills Bypoll) వేడెక్కుతోంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌కు ఎదురుగా అసాధారణ రాజకీయ సమీకరణం ఏర్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఆమె ఆరోపణల ప్రకారం..BRS, BJP, TDP పార్టీలు కాంగ్రెస్‌ను బలహీనపరచడమే లక్ష్యంగా ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయని అన్నారు. “కాంగ్రెస్ గెలవకూడదనే ఉద్దేశంతో ఈ మూడు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి అని ఆమె విమర్శించారు.
Bomb Threats : తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు
TDP పార్టీ తమ ‘మిత్రధర్మం’ పేరుతో పోటీ నుంచి తప్పుకోవడం కూడా ఈ ఒప్పందంలో భాగమే అని చెప్పారు. TDP పైకి BJPకి మద్దతు ఇస్తున్నట్లు చూపిస్తుండగా వాస్తవానికి BRS అభ్యర్థి విజయం కోసం గుప్తంగా పనిచేస్తోంది అని విజయశాంతి పేర్కొన్నారు. ఇదే సమయంలో BRS నేతలు కూడా తమ స్థానిక కేడర్‌కు ‘BJPతో గెలుపు డ్రామా ఆడుతూ, BRS విజయానికి కృషి చేయాలి’ అని ఆదేశాలు జారీ చేసినట్లు పలు మీడియా కథనాలు వెలువడ్డాయని ఆమె పేర్కొన్నారు.
BJP కూడా నిజమైన పోటీ కోసం కాకుండా, ఒక డమ్మీ అభ్యర్థిని బరిలోకి దింపబోతుందనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఈ మొత్తం పరిణామాలతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇప్పుడు కేవలం ఓటర్ల సమరభూమి కాదు, రాజకీయ వ్యూహాల యుద్ధరంగంగా మారింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ నాయకత్వం కూడా తక్షణమే కౌంటర్‌స్ట్రాటజీ సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఫలితం కేవలం స్థానిక ప్రభావం మాత్రమే కాకుండా, తెలంగాణలో రాబోయే రాజకీయ సమీకరణాల దిశను సూచించే సూచికగా మారనుంది.
